CM Vijay : సొంత సినిమా రిలీజ్.. కఠిన రూల్స్ పెడుతున్న సీఎం విజయ్..

తమిళనాడు స్టార్ హీరో విజయ్ సీఎం అవకముందు తన చివరి సినిమాగా జననాయగాన్ తీశారు. (CM Vijay)

  • Published on- July 8, 2026 / 08:25 AM IST

CM Vijay

CM Vijay : తమ సినిమా రిలీజ్ అవుతుంటే ఏ రకమైన సపోర్ట్ కావాలంటే ఆ సపోర్ట్ చేస్తారు హీరోలు. ప్రమోషన్స్ చేసి జనాల్లోకి తీసుకెళ్తారు. స్టార్ హీరోలు ప్రమోషన్స్ కి దూరంగా ఉన్నా సినిమా రిలీజ్ విషయంలో వెనకుండి అన్ని రకాల సపోర్ట్ ఇస్తారు. అయితే తమిళనాడు సీఎం తన చివరి సినిమా రిలీజ్ విషయంలో కఠినంగా ఉన్నారట.

తమిళనాడు స్టార్ హీరో విజయ్ సీఎం అవకముందు తన చివరి సినిమాగా జననాయగాన్ తీశారు. ఈ సినిమా ఎప్పట్నుంచో రిలీజ్ అవ్వకుండా సెన్సార్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇప్పుడు విజయ్ సీఎం అయినా ఈ సినిమా రిలీజ్ కష్టంగానే ఉంది. అదిగో ఇదిగో అని ఏదో ఒక డేట్ జననాయగాన్ రిలీజ్ అని చెప్తున్నారు కానీ అది జరగట్లేదు. తాజాగా జననాయగాన్ సినిమా జులైలో రిలీజ్ అవుతుందని అంటున్నారు.

Also Read : Maa Inti Bangaram : ‘మా ఇంటి బంగారం’ వంద కోట్ల పోస్టర్ వేస్తారా? అరుంధతితో పోలిక కరెక్టేనా..?

అయితే రిలీజ్ ఎప్పుడైనా కానీ జననాయగాన్ విషయంలో సీఎం విజయ్ ఓ కఠిన నిర్ణయం తీసుకున్నారని తమిళ మీడియా సమాచారం. విజయ్ ని దెబ్బ తీయడానికి ఆయన ప్రత్యర్థులు జననాయగాన్ సినిమాని వాడుకోవాలని చూస్తున్నారట. ఈ సినిమాకు బ్లాక్ లో టికెట్లు అమ్మినా, టికెట్లు ఎక్కువ రేట్లకు అమ్మినా విజయ్ అధికార దుర్వినియోగానికి, అవినీతికి పాల్పడుతున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడానికి రెడీగా ఉన్నారట.

ఇది ముందే తెలుసుకున్న విజయ్ గట్టి నిఘా చర్యలకు ఆదేశాలు ఇచ్చారు. సినిమా రిలీజ్ తర్వాత థియేటర్లపై ఆకస్మిక దాడులు నిర్వహించాలని, అనుమతించిన ధరల కంటే టికెట్లను ఒక్క రూపాయి ఎక్కువ అమ్మినా థియేటర్ లైసెన్సులను రద్దు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో జననాయగాన్ రిలీజ్ మరింత ఆసక్తిగా మారింది.