Collar ey etthara song update from ustaad bhagat singh
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి థర్డ్ సింగిల్ ప్రోమో విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ “కాలరే ఎత్తరా” ప్రోమోను ఈరోజు (మంగళవారం) సాయంత్రం 4:36 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ అనౌన్స్‌మెంట్‌తో సోషల్ మీడియాలో ‘ఉస్తాద్(Ustaad Bhagat Singh)’ మేనియా మొదలైపోయింది.
Salman-Samantha: సల్మాన్ ఖాన్ సరసన సమంత.. భర్త రాజ్ తో కలిసి క్రేజీ ప్రాజెక్ట్
ఇక పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ – దేవి శ్రీ ప్రసాద్.. ఈ ముగ్గురి కాంబినేషన్ అనగానే ‘గబ్బర్ సింగ్’ మ్యాజిక్ గుర్తుకొస్తుంది. ఇప్పుడు అదే తరహాలో ఒక హై-ఎనర్జీ మాస్ సాంగ్‌ను ఈ సినిమా కోసం డీఎస్పీ సిద్ధం చేశారట. ఈ పాటలో పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్‌లో మాస్ స్టెప్పులతో రచ్చ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ పాట విడుదల తరువాత సినిమాపై అంచనాలు మరింత పెరుగుతాయని సమాచారం. ఇక ఫుల్ సాంగ్ మార్చి 12న విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి కొద్దిసేపట్లో విడుదల కాబోతున్న ఈ ప్రోమో యూట్యూబ్‌లో ఏ స్థాయి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.