Revanth Reddy – Ali : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కమెడియన్ అలీ భేటీ.. వరద బాధితుల సహాయం కోసం..

తాజాగా కమెడియన్ అలీ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు.

Comedian Ali Meets Telangana CM Revanth Reddy

Revanth Reddy – Ali : తాజాగా కమెడియన్ అలీ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఇటీవల ఏపీ, తెలంగాణాలో వరదలు వచ్చి పలు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో వరద బాధితుల కోసం కమెడియన్ అలీ ఆంధ్రప్రదేశ్‌కు 3 లక్షలు, తెలంగాణకు 3 లక్షలు సాయం ప్రకటించారు.

Also Read : Chiranjeevi – Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి భేటీ..

నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అలీ దంపతులు కలిసి 3 లక్షల రూపాయల చెక్ ను అందించారు. సీఎం రేవంత్ రెడ్డి అలీకి ధన్యవాదాలు తెలిపి శాలువాతో సత్కరించారు. నేడు మెగాస్టార్ చిరంజీవి కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వరద బాధితుల కోసం ప్రకటించిన ఆర్ధిక సహాయాన్ని అందించారు.