Pradeep Kottayam : సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత..
ప్రముఖ మలయాళీ నటుడు, కమెడియన్ ప్రదీప్ కొట్టాయమ్ ఇవాళ ఉదయం గుండెపోటుతో మరణించారు. 61 ఏళ్ళ వయసులు అయన గుండెపోటుతో మరణించారు. 40 ఏళ్ళ వయసులో 2001లో నటుడిగా కెరీర్...........
- Saketh U
- Published On : February 17, 2022 / 12:31 PM IST
Pradeep
Pradeep Kottayam : ఇటీవల కరోనాతో లేదా వేరే ఆరోగ్య సమస్యలతో చాలా మంది సినీ సెలబ్రిటీలు మరణిస్తున్నారు. వారి మరణం సినీ పరిశ్రమకి తీవ్ర శోకాన్ని మిగులుస్తుంది. అన్ని సినీ పరిశ్రమలలోను పలువురు ప్రముఖులు ఇటీవల మృత్యువాత పడ్డారు. ఇటీవలే ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మరణించారు. ఆమె మరణ వార్తని జీర్ణించుకోకముందే తాజాగా మంగళవారం రాత్రి బాలీవుడ్ ఫేమస్ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లహరి కన్నుమూశారు. అదే రోజు మరో ప్రముఖ బెంగాలీ గాయని సంధ్య ముఖర్జీ కూడా మరణించారు. తాజాగా ప్రముఖ కమెడియన్ కన్ను మూశారు.
ప్రముఖ మలయాళీ నటుడు, కమెడియన్ ప్రదీప్ కొట్టాయమ్ ఇవాళ ఉదయం గుండెపోటుతో మరణించారు. 61 ఏళ్ళ వయసులు అయన గుండెపోటుతో మరణించారు. 40 ఏళ్ళ వయసులో 2001లో నటుడిగా కెరీర్ ప్రారంభించారు ఈయన. ప్రదీప్ కొట్టాయమ్ ఇప్పటివరకు మలయాళం, తమిళ్, తెలుగు సినిమాల్లో దాదాపు 70పైగా సినిమాల్లో కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించారు. రాజా రాణి, ఏమాయ చేసావే లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి కూడా చేరువయ్యారు.
Mohan Babu : ఆ ఇద్దరు హీరోలు నా మీద ట్రోల్స్ చేయిస్తున్నారు.. ఏదో ఒకరోజు శిక్ష అనుభవిస్తారు..
ప్రదీప్ కొట్టాయమ్ మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మలయాళ స్టార్ హీరో పృద్విరాజ్ సుకుమారన్ తో సహా పలువురు మలయాళం స్టార్లు ఆయన మృతికి సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియచేస్తున్నారు.
Rest in peace! #KottayamPradeep ? pic.twitter.com/zUHU2GflqH
— Prithviraj Sukumaran (@PrithviOfficial) February 17, 2022
