Prakash Raj: సన్‌షైన్ హాస్పిటల్లో ప్రకాష్ రాజ్‌కు పూర్తైన ఆపరేషన్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ షూటింగ్లో గాయాల కారణంగా ఆస్పత్రిలో చేరారు.
- vamsi
- Published on- August 11, 2021 / 11:13 AM IST
Pk Raj
Prakash Raj: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ షూటింగ్లో గాయాల కారణంగా ఆస్పత్రిలో చేరారు. హైదరాబాద్‌లోని సన్‌షైన్ హాస్పిటల్లో ప్రకాష్ రాజ్‌కు ఆపరేషన్ పూర్తయ్యింది. లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్‌కి సర్జరీ చేసిన డాక్టర్ల బృందం.. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని ప్రకాష్ రాజ్‌కు సూచించారు. చెన్నైలోని ధనుష్ సినిమా షూటింగ్లో పాల్గొన్న ప్రకాష్ రాజ్‌కు లొకేషన్లో గాయం అయ్యింది.
ఈ ప్రమాదంలో ప్రకాశ్‌రాజ్ చేతికి ఫ్రాక్చర్ అవగా.. ఈ విషయంపై ట్విట్టర్లో స్పందించిన ప్రకాశ్‌రాజ్.. సర్జరీ కోసం తన స్నేహితుడు డాక్టర్ గురువా రెడ్డి దగ్గరకు హైదరాబాద్ వస్తున్నట్లు తెలిపారు. తాను క్షేమంగానే ఉన్నానని, అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు. స్టేజ్ మీద నుంచి కింద పడిపోవడంతో దెబ్బలు తగిలినట్టు తెలుస్తోంది. అయితే ఆ గాయాలకు సర్జరీ చేయాల్సి రావడంతో వెంటనే హైద్రాబాద్‌కు తరలి వచ్చారు ప్రకాష్ రాజ్. డాక్టర్ గురువారెడ్డి తనను బాగా చూసుకుంటున్నారని, ఆయన ఆధ్వర్యంలోనే సర్జరీ జరిగినట్లు ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు.
మా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన ప్రకాష్ రాజ్.. తెలుగులో ఫుల్ బిజీగా సినిమాలు చేస్తున్నారు. కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. పూరి జగన్నాథ్ లైగర్ సినిమాలోనూ ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన నవరస వెబ్ సిరీస్‌లోనూ కనిపించి మెప్పించారు ప్రకాష్ రాజ్.
