Nikhil-Naveen : ‘మామా.. నీ సినిమా చూడలేకపోయా..’ నిఖిల్-నవీన్ పొలిశెట్టిల మధ్య సంభాషణ వైరల్..
స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి (Anushka Shetty), నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty)లు నటించిన సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty). పి.మహేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
- Thota Vamshi Kumar
- Updated on- September 13, 2023 / 03:21 PM IST
Nikhil-Naveen Polishetty
Nikhil-Naveen Polishetty, : స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి (Anushka Shetty), నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty)లు నటించిన సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty). పి.మహేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ క్రమంలో తనకు మంచి విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇటీవల నవీన్ పొలిశెట్టి ఓ ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్‌పై తాజాగా యంగ్ హీరో నిఖిల్ (Nikhil) స్పందించాడు. తనకోసం వియత్నాంలో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా స్పెషల్ షో వేయించమని కోరాడు. ‘హేయ్ మామ.. నువ్వు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో విజయం అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. అయితే.. నేను వియత్నాంలో ఉండడం వల్ల నీ సినిమాను చూడలేకపోయా. ఇక్కడ ఓ స్పెషల్ షో వేయించొచ్చుగా.. మీ సినీ బృందానికి నా అభినందనలు.’ అంటూ నిఖిల్ ట్వీట్ చేశాడు.
Jawan Collections : బాక్సాఫీస్ వద్ద తగ్గుతున్న జవాన్ కలెక్షన్స్.. 1000 కోట్లు కష్టమేనా..?
‘ధన్యవాదాలు సోదరా.. వియత్నాంలోనా..? తప్పకుండా షో వేయిస్తా.. అడ్రస్ పెట్టు.. నువ్వు ముందు అడ్రస్ పెట్టు .. నువ్వు ఎప్పుడు ఇండియాకు వస్తావ్..? నా సినిమా పట్ల నీ అభిప్రాయం తెలుసుకునేందుకు ఎదురుచూస్తున్నా.’ అంటూ నవీన్ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం వీరిద్దరి ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రూపుదిద్దుకుంది. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌లు ఈ చిత్రాన్ని నిర్మించారు. అనుష్క, నవీన్ కెమిస్ట్రీ ఆకట్టుకోగా, కామెడీకి జనాలు ఫిదా అయ్యారు. సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు సైతం దక్కాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ బాక్సాఫీస్ వద్ద సైతం ఈ సినిమా మంచి కలెక్షన్లు సాధిస్తోంది.
Hanuaman : ‘హనుమాన్’ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ.. వినాయక చవితి నుంచి..
