CP Sajjanar: 21 వేల సినిమాలు.. రూ.20 కోట్ల సంపాదన.. 50 లక్షల మంది డాటా.. షాకింగ్ విషయాలు చెప్పిన సీపీ సజ్జనార్
టాలీవుడ్ స్టార్స్ చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్‌రాజు హైదరాబాద్ సీపీ సజ్జనార్(CP Sajjanar)తో భేటీ అయ్యారు. ఇటీవల ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
- V Santhosh Kumar
- Published On : November 17, 2025 / 12:16 PM IST
CP Sajjanar reveals shocking things about iBomma manager Immadi Ravi
CP Sajjanar: టాలీవుడ్ స్టార్స్ చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్‌రాజు హైదరాబాద్ సీపీ సజ్జనార్‌తో(CP Sajjanar) భేటీ అయ్యారు. ఇటీవల ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ సినీపెద్దలు సీపీ సజ్జనార్‌తో అయ్యారు. ఈ భేటీ అనంతరం సీపీ సజ్జనార్ మీడియాతో మాట్లాడారు. “పైరసీ కారణంగా సినీ రంగానికి చాలా నష్టం జరిగింది. దీన్ని కట్టడి చేయడంలో భాగంగానే ఐబొమ్మ వెబ్ సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్టు చేయడం జరిగింది. రవిపై ఇప్పటికే ఐటీ యాక్ట్, కాపీ రైట్ యాక్ట్ 4 కేసులు నమోదు అయ్యాయి. ఈ పైరసీకి సంబంధించి ఇప్పటికే శివరాజ్, ప్రశాంత్ లను కూడా అరెస్టు చేయడం జరిగింది. ఇమ్మడి రవి కేవలం పైరసీ ద్వారానే కాకుండా బెట్టింగ్ యాప్‌లను సైతం ప్రమోట్ చేస్తున్నాడు.
Priya Prakash Varrier: ప్రియా ప్రకాష్ వారియర్.. వారేవా నీ గ్లామర్.. ఫొటోలు
దానివల్ల చాలా మంది అమాయకులు చనిపోయారు. వెబ్ సైట్ క్రియేట్ చేయడంలో రవి ఆరితేరాడు. ఒక వెబ్‌సైట్‌ను బ్లాక్ చేస్తే.. కొత్త సైట్‌ను తయారు చేసేవాడు. అలా ఏకంగా 65 మిర్రర్ వెబ్‌సైట్లు అతను నిర్వహించాడు. అతడి దగ్గర దొరికిన హార్డ్ డిస్క్‌లో 21 వేల సినిమాలు ఉన్నాయి. అందులో, 1972లో రిలీజ్ అయిన గాడ్‌ఫాదర్ నుంచి 2025 ఓజీ వరకు ఉన్నాయి. ఈ వెబ్ సైట్ ద్వారా రవి ఏకంగా రూ.20 కోట్లు సంపాదించాడు. ఐబొమ్మను యూస్ చేస్తున్న దాదాపు 50 లక్షల మంది సబ్‌స్క్రైబర్ల డేటా అతను దగ్గర ఉంది. ఇంత డేటా అతడి వద్ద ఉండటం చాలా ప్రమాదకరం”అంటూ తెలిపాడు సజ్జనార్.
