Muralitharan : వెంకటేష్, నాని గురించి క్రికెటర్ మురళీధరన్ కామెంట్స్.. ఎన్టీఆర్ ప్రభాస్‌ని కూడా..
క్రికెటర్ మురళీధరన్ టాలీవుడ్ స్టార్ హీరోలు వెంకటేష్, నాని, ఎన్టీఆర్ ప్రభాస్ గురించి..
- gum 95921
- Published On : September 25, 2023 / 05:40 PM IST
Cricketer Muralitharan comments on Daggubati Venkatesh Nani NTR Prabhas
Muralitharan : శ్రీలంక క్రికెట్ ఆటగాడు ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘800’. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యి ఆడియన్స్ ని బాగా ఆకట్టుంది. ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో సందడి చేస్తుంది. ఈక్రమంలోనే రీసెంట్ గా హైదరాబాద్ ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో క్రికెటర్స్ మురళీధరన్, వీవీఎస్ లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యి సందడి చేశారు.
Sivakarthikeyan : సౌత్ స్టార్ డైరెక్టర్‌తో సినిమా అనౌన్స్ చేసిన శివ కార్తికేయన్..
ఇక ఈ కార్యక్రమంలో మురళీధరన్ మాట్లాడుతూ టాలీవుడ్ హీరోలు విక్టరీ వెంకటేష్ (Daggubati Venkatesh), నేచురల్ స్టార్ నాని (Nani) గురించి ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశాడు. టాలీవుడ్ సెలబ్రిటీస్ తో ఒక ఇండియన్ క్రికెట్ టీంని ఏర్పాటు చేయాల్సి వస్తే ఎవరెవర్ని ఎంపిక చేసుకుంటారు అని మురళీధరన్ ని ప్రశ్నించారు. దీనికి మురళీధరన్ బదులిస్తూ.. “వెంకటేష్ ను కెప్టెన్ చేయాలి. ఎందుకంటే ఆయనకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఎప్పుడు జరిగిన అసలు మిస్ కారు ఆయన” అంటూ పేర్కొన్నాడు.
Kannappa : హీరోయిన్ లేకుండా ‘కన్నప్ప’ షూటింగ్ స్టార్ట్.. మూవీలో మరో సూపర్ స్టార్..!
అలాగే నానిని కూడా ఎంపిక చేస్తాను అంటూ వెల్లడించాడు. నాని నటించిన జెర్సీ సినిమా చూశానని, అందులో తన యాక్టింగ్ బాగా నచ్చిందని చెప్పుకొచ్చాడు. 800 మూవీ ప్రొడక్షన్ విషయంలో నానితో ఒకసారి ఫోన్ లో మాట్లాడినట్లు వెల్లడించాడు. ఇక టాలీవుడ్ బిగ్ స్టార్స్ జూనియర్ ఎన్టీఆర్ (NTR) నుంచి ప్రభాస్ (Prabhas) వరకు అందర్నీ ఇండియన్ టీంకి ఎంపిక చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. కాగా ఈ మూవీ అక్టోబర్ 6న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఎంఎస్ శ్రీపతి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో మురళీధరన్ పాత్రని స్లమ్‌డాగ్ మిలియనీర్ ఫేమ్ ‘మధుర్ మిట్టల్’ చేస్తున్నాడు.
