Cyclone Arnab : ‘అర్నబ్’ తుఫాను ఎఫెక్ట్.. మూతపడ్డ థియేటర్లు.. మళ్ళీ ఎప్పుడు ఓపెన్ అవుతాయంటే..
కాకినాడ జిల్లాలో సినిమా షోలకు బిగ్ బ్రేక్ పడింది. (Cyclone Arnab)
- Saketh U
- Published on- October 27, 2026 / 04:24 PM IST
Cyclone Arnab
Cyclone Arnab : బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ అతి తీవ్ర తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది. ఈ క్రమంలో నేడు సాయంత్రం నుంచి పోలవరం, కోనసీమ, కాకినాడ, తూర్పు-పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే తుఫాను తీవ్రత దృష్ట్యా ప్రభావిత జిల్లాల యంత్రాంగాన్ని ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసింది.
ఈ క్రమంలో కాకినాడ జిల్లాలో సినిమా షోలకు బిగ్ బ్రేక్ పడింది. తీవ్రమైన ‘అర్నబ్’ తుఫాను హెచ్చరికలు, భారీ ఈదురుగాలులు, కుండపోత వర్షాల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఈ విషయంలో అత్యవసర నిర్ణయం తీసుకుంది.
Also Read : Vishwak Sen : నాకు ఎన్ని డబ్బులు ఆఫర్ చేసినా అలాంటి రోల్స్ చేయను.. విశ్వక్ సేన్ కామెంట్స్..
ప్రజల ప్రాణ భద్రత, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. నేడు (27.10.2026) మధ్యాహ్నం నుంచి అన్ని థియేటర్లలో ప్రదర్శనలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసారు. రేపు (28.10.2026) రోజంతా కాకినాడ జిల్లా పరిధిలోని అన్ని సినిమా థియేటర్లలో షోలు పూర్తిగా రద్దు చేసారు. వాతావరణ పరిస్థితులను సమీక్షించిన అనంతరం తిరిగి 29.10.2026 నుంచి థియేటర్లు తెరుచుకునే అవకాశం ఉంది. ఈ ఆదేశాలను కాకినాడ జిల్లాలోని అన్ని థియేటర్ యాజమాన్యాలు తప్పనిసరిగా పాటించాలని జాయింట్ కలెక్టర్ & అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఒకవేళ తుఫాను తగ్గకపోతే ఈ ఆదేశాలు ఆ తర్వాత కూడా పొడిగిస్తారని తెలుస్తుంది. తుఫాను ఎఫెక్ట్ తో థియేటర్స్ మూసివేయడం కొనసాగితే అక్టోబర్ 30న రిలీజయ్యే ఆదర్శ కుటుంబం, కల్ట్, కిల్లర్ సినిమాలు ఎఫెక్ట్ అవ్వక తప్పదు.
