ప్రభాస్‌తో వైభవి మర్చంట్! పిక్స్ వైరల్..

  • Publish Date - October 27, 2020 / 02:57 PM IST

Prabhas – Vaibhavi Merchant: రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రెస్టీజియస్ ఫిల్మ్.. ‘‘రాధే శ్యామ్’’.. పూజా హెగ్డే కథానాయిక. రెబల్ స్టార్ డా.యు.వి.కృష్ణంరాజు సమర్పణలో గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్, ‘జిల్’ ఫేం రాధాకృష్ణ కుమార్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది.




అక్టోబర్ 23 డార్లింగ్ పుట్టినరోజు సందర్భంగా ‘‘బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్” పేరిట విడుద‌ల చేసిన మోష‌న్ పోస్ట‌ర్‌కు మంచి స్పందన వస్తోంది. షూటింగ్ కోసం ఇటలీ వెళ్లిన ప్రభాస్ అక్కడే తన 41వ పుట్టినరోజును జరుపుకున్నాడు.

తాజాగా పాపులర్ కొరియోగ్రాఫర్ Vaibhavi Merchant, ప్రభాస్‌తో కలిసి తీసుకున్న పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేయగా బాగా వైరల్ అవుతున్నాయి. ఈ షెడ్యూల్ తో సినిమా పూర్తవుతుందని సమాచారం. ‘‘రాధేశ్యామ్” ను తెలుగు, మలయాళం, హిందీ, తమిళ, క‌న్న‌డ‌ భాషల్లో విడుద‌ల చేయనున్నారు.