Dear Heart : ‘డియర్ హార్ట్’ మోషన్ పోస్టర్ రిలీజ్.. డైరెక్టర్ సాయి రాజేష్ చేతుల మీదుగా..
తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మోస్టర్ పోస్టర్‌ను డైరెక్టర్ సాయి రాజేష్ రిలీజ్ చేశారు. (Dear Heart)
- Saketh U
- Published on- September 4, 2026 / 06:56 PM IST
Dear Heart
Dear Heart : లక్ష్మణ్ టేకుమూడి, రాధికా జోషి, సుప్రియా చవాన్ మెయిన్ లీడ్స్ గా వారాహి ఆర్ట్స్ బ్యానర్ పై బొబ్బాస్ సమర్పణలో రావి సౌజన్య నిర్మాణంలో జీడీ నరసింహా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘డియర్ హార్ట్’. ఈ సినిమాలో సురేష్ గురు, పృధ్వీ రాజ్, సత్య ప్రకాష్, జబర్దస్త్ నూకరాజు, జగదీశ్వరి.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మోస్టర్ పోస్టర్‌ను డైరెక్టర్ సాయి రాజేష్ రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ ఓ లవ్ కొటేషన్ తో సాగింది. ‘కొన్ని ప్రేమ కథలు కొన్ని రోజులు మాత్రమే గుర్తుంటాయి.. కానీ కొన్ని కథలు కాలం ఉన్నంత వరకు గుర్తుంటాయి.. నువ్వు నాకు ఎదురైన ప్రతీసారి కాలం కూడా ఒక్క క్షణం ఆగిపోయి చూసేది.. నా చివరి శ్వాస వరకు.. నా గుండె కొట్టుకున్న ప్రతీసారి ఆ చప్పుడు చెప్పే ఒకే ఒక్క పేరు.. నీదే.. బతికుంటే నీ ప్రేమతో.. ఊపిరి ఆగితే నీ జ్ఞాపకాలతో.. ప్రతీ ప్రేమ కథ ముగింపు వరకు వెళ్లలేకపోవచ్చు.. కానీ నిజమైన ఏ ప్రేమ అయినా చరిత్రలో అలా గుర్తుండిపోవాల్సిందే.. మన ప్రేమలా’ అంటూ వాయిస్ ఓవర్ తో హీరో – హీరోయిన్ పాత్రలతో ఈ మోషన్ పోస్టర్ సాగింది.
Also See : Sravanthi Chokarapu : ఫ్రెండ్స్, ఫ్యామిలీతో యాంకర్ స్రవంతి వరలక్ష్మి వ్రతం.. ఫొటోలు..
ఈ మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి సాయి రాజేష్ మూవీ యూనిట్ కి ఆల్ ది బెస్ట్ తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
