పాతికేళ్ల తర్వాత ‘బాషా’ ఈజ్ బ్యాక్
సూపర్‌స్టార్ రజనీకాంత్ 70వ పుట్టిన రోజు సందర్భంగా ‘బాషా’ చిత్రాన్ని డిజిటలైజ్ చేసి సరికొత్తగా డిసెంబర్ 11న విడుదల చేయనున్నారు..
- sekhar
- Published On : November 23, 2019 / 11:36 AM IST
సూపర్‌స్టార్ రజనీకాంత్ 70వ పుట్టిన రోజు సందర్భంగా ‘బాషా’ చిత్రాన్ని డిజిటలైజ్ చేసి సరికొత్తగా డిసెంబర్ 11న విడుదల చేయనున్నారు..
‘ఈ బాషా ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టు’.. ఈ డైలాగ్ ఎంత పాపులరో తెలిసిందే. సూపర్‌స్టార్ రజినీకాంత్ స్టార్‌డమ్‌ని అమాంతం ఆకాశం అంత ఎత్తుకి పెంచింది.. ఈ సినిమాతోనే రజినీ సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ అయ్యారు. ఈ సినిమా ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
రజనీ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిన ఈ చిత్రాన్ని సురేశ్‌కృష్ణ దర్శకత్వంలో సత్యమూవీస్ సంస్థ నిర్మించింది. రజనీకాంత్ 70వ పుట్టిన రోజు సందర్భంగా ‘బాషా’ చిత్రాన్ని డిజిటలైజ్ చేసి సరికొత్తగా డిసెంబర్ 11న తమిళనాడులోని ప్రధాన నగరాల్లో విడుదలచేయనున్నట్లు సత్యామూవీస్ వర్గాలు వెల్లడించాయి.
Read Also : ‘అర్జున్ సురవరం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ : చీఫ్ గెస్ట్‌గా చిరు
‘బాషా’ రీ-రిలీజ్ రజనీకాంత్ అభిమానులకు బర్త్‌డే కానుక అని సంస్థ పేర్కొంది. ఇటీవలే ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అవార్డును అందుకున్నారు సూపర్‌స్టార్.. రజినీ, మురుగుదాస్ దర్శకత్వంలో నటించిన ‘దర్బార్’ టీజర్ రజినీ పుట్టినరోజు నాడు విడుదల చేయనున్నార. సినిమా సంక్రాంతి కానుకగా 2020 జనవరి 9న రిలీజ్ కానుంది.
This is dedicated to all cinema fans! Let the celebrations begin!!
#Baashha#BaashhaIsBack
@rajinikanth @nagma_morarji @Suresh_Krissna @sathyamovies @DoneChannel1 @Ftpindia @iamrathnavel pic.twitter.com/O9YfwcEVry— Sathya Movies (@sathyamovies) November 21, 2019
