Deepika Padukone : మరోసారి తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్.. ధురంధర్ వివాదానికి స్వస్తి..

తాజాగా దీపికా పదుకోన్ రెండోసారి తల్లి కాబోతున్నట్టు ప్రకటించింది. (Deepika Padukone)

  • Published on- April 19, 2026 / 12:36 PM IST

Deepika Padukone

Deepika Padukone : ఇటీవలే రణవీర్ సింగ్ ధురంధర్ 2 తో భారీ పాన్ ఇండియా హిట్ కొట్టాడు. రణవీర్ – దీపికా పదుకోన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే, ఈ జంటకు 2024 లో ఓ పాప పుట్టింది. ఈ పాపకు దువా అనే పేరు పెట్టారు. తాజాగా దీపికా పదుకోన్ రెండోసారి తల్లి కాబోతున్నట్టు ప్రకటించింది.

రణవీర్ – దీపికా కూతురు దువా ప్రగ్నెన్సీ టెస్ట్ కిట్ ని చూపిస్తున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి తాము మరోసారి తల్లితండ్రులు కాబోతున్నామని ప్రకటించారు రణవీర్ సింగ్, దీపికా పదుకోన్. దీంతో బాలీవుడ్ సెలబ్రిటీలు, ఫ్యాన్స్ ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Also Read : Pawan Kalyan : ఆపరేషన్.. ఆపరేషన్ అంటున్నారు.. అసలు పవన్ కళ్యాణ్ కి ఏమైంది?

ఇటీవల ధురంధర్ సక్సెస్ పై అందరూ మాట్లాడినా భర్త సినిమా గురించి మాట్లాడలేదు, అభినందించలేదు అని దీపికా పై విమర్శలు వచ్చాయి. దీపికా – రణవీర్ మధ్య మనస్పర్థలు వచ్చాయని కూడా బాలీవుడ్ లో రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు ఈ ప్రగ్నెన్సీ ప్రకటనతో అలాంటిదేమి లేదు అని, వాళ్ళు హ్యాపీగానే ఉన్నట్టు డైరెక్ట్ గానే క్లారిటీ ఇచ్చేసారు.

 

Also Read : Samantha : మళ్ళీ బాపు బొమ్మలా మారిన సమంత.. ఫొటోలు..