నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) డ్రగ్స్ అంశంలో యాక్టర్ DEEPIKA PADUKONEను ఇంటరాగేట్ చేశారు. శనివారం ఐదుగంటలకు పైగా మేనేజర్ కరిష్మా ప్రకాశ్ తో జరిపిన చాటింగ్ గురించి ఎంక్వైరీ చేశారు. ఈ విచారణలో దీపికా మూడు సార్లు ఏడ్చేసింది. అది చూసి విసుక్కున్న అధికారులు ఎమోషనల్ కార్డు ఆపేయాలని.. ఆదేశించారట. తాను మేనేజర్ కరిష్మాతో డ్రగ్స్ గురించి మాట్లాడింది వాస్తవమే కానీ, నార్కోటిక్స్ పదార్థాలు ఏవీ తీసుకోలేదని చెప్పింది. ఎన్సీబీ ఆమె ఫోన్ ను కూడా సీజ్ చేశారు.
ఎన్సీబీ సమాచారం మేరకు… ఢిల్లీ నుంచి ముంబై వచ్చిన అస్తానా చాలా మంది అధికారులను కలిసింది. బాలీవుడ్ సెలబ్రిటీల మధ్య జరిగిన డ్రగ్స్ సంభాషణపై కంప్లైంట్ తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ)ని కలిసి కేసు రిజిష్టర్ చేశారు.
దాంతో పాటు ఎన్సీబీ సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్, రకుల్ ప్రతీ సింగ్ ను కూడా ఇంటరాగేట్ చేశాడు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పలు రకాల చాట్ లను పరిశీలించిన తర్వాత ముగ్గురు యాక్టర్లపై కేసులు బుక్ చేశారు. దీపికాను మొదటగా మాజీ మేనేజర్ కరిష్మా ప్రకాశ్ తో చాట్ చేసిన నెంబర్ ను గుర్తుపట్టగలదా అని అడిగారట. తాను కరిష్మా నుంచి గానీ, మరే ఇతర వ్యక్తులతో గానీ మాల్ గురించి ఏమైనా అడిగారా అని ప్రశ్నించారట.
సుషాంత్ మాజీ మేనేజర్ శ్రుతి మోడీ, బాలీవుడ్ యాక్టర్ రకుల్ ప్రీత్ సింగ్, ధర్మ ప్రొడక్షన్స్ మాజీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్షితిజ్ ప్రసాద్ రవి, క్వాన్ టాలెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ సీఈఓ ధ్రువ్ చిట్గోపెకర్, ప్రొడ్యూసర్ మధు మంతెన వర్మ ఇంకొందరి స్టేట్ మెంట్లు రికార్డు చేసింది NCB.