Project K : ఇది అప్డేటా? దీనికోసం మళ్ళీ లేట్.. ప్రాజెక్ట్ K నుంచి దీపికా పదుకొనే ఫస్ట్ లుక్‌పై అభిమానులు, నెటిజన్ల విమర్శలు..

ప్రాజెక్ట్ K సినిమా నుంచి దీపికా పదుకొనే ఫస్ట్ లుక్ నిన్న సాయంత్రం రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.

Deepika Padukone first look released Fans trolls on Project K Movie Unit

Deepika Padukone First Look : నాగ అశ్విన్(Nag Ashwin) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) హీరోగా రాబోతున్న సినిమా ప్రాజెక్ట్ K(Project K). ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రాజెక్ట్ K సినిమాలో దీపికా పదుకొనే(Deepika Padukone) హీరోయిన్ గా నటిస్తుండగా అమితాబ్(Amitabh), కమల్ హాసన్(Kamal Haasan), దిశా పటాని(Disha Patani).. మరికొంతమంది స్టార్లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. జులై 21న ఈ సినిమా టైటిల్, గ్లింప్స్ హాలీవుడ్ ఈవెంట్ కామిక్ కాన్ లో రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించి సినిమాకు మరింత హైప్ తెచ్చారు చిత్రయూనిట్.

అయితే ప్రాజెక్ట్ K సినిమా నుంచి దీపికా పదుకొనే ఫస్ట్ లుక్ నిన్న సాయంత్రం రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ చెప్పిన టైంకి రిలీజ్ చేయకుండా లేట్ అవుతుందని చెప్పి సారీ చెప్పారు చిత్రయూనిట్. నాలుగు గంటల ఆలస్యం తర్వాత నిన్న రాత్రి దీపికా పదుకొనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ ఫోటో చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఆ ఫోటోలో కేవలం దీపికా ఫేస్ మాత్రమే ఉంది. అది కూడా బయట దిగితే ఎలా ఉంటుందో అంతే మాములుగా ఉంది.

Ketika Sharma : పవన్ కళ్యాణ్ గారి కోసమే సినిమా ఒప్పుకున్నా.. కానీ పవన్ గారితో ఒక్క సీన్ కూడా లేదు..

ప్రాజెక్ట్ K యూనిట్ ఇచ్చిన ఈ అప్డేట్ చూసి అటు దీపికా అభిమానులతో పాటు, ప్రభాస్ అభిమానులు కూడా నిరాశ చెందారు. దీంతో చిత్రయూనిట్ పై సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. దీన్ని అప్డేట్ అంటారా? ఈ పాస్ పోర్ట్ ఫోటో కోసం మళ్ళీ నాలుగు గంటలు లేట్? అసలు ఫస్ట్ లుక్ అంటే ఎలా ఉంటుందో తెలుసా అంటూ అభిమానులు ప్రాజెక్ట్ K మూవీ యూనిట్ పై విమర్శలు చేస్తున్నారు. ఇక జులై 21న రిలీజ్ చేయబోయే టైటిల్, గ్లింప్స్ ఎలా ఉంటుందో చూడాలి మరి.

ట్రెండింగ్ వార్తలు