Desamuduru Re Release : దేశముదురు రీ రిలీజ్.. కేరళలో బన్నీ క్రేజ్ మాములుగా లేదుగా!
ఈ ఏడాది అల్లు అర్జున్ (Allu Arjun) పుట్టినరోజు సందర్భంగా 'దేశముదురు' (Desamuduru) సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. అయితే కేరళ స్టేట్ లో ఏ రేంజ్ లో రిలీజ్ అవుతుందో తెలుసా?
- gum 95921
- Updated on- April 2, 2023 / 07:30 AM IST
Desamuduru Re Release on the occasion of allu arjun birthday
Desamuduru Re Release : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి (Allu Arjun) మాస్ ఇమేజ్ ని తీసుకు వచ్చిన చిత్రం ‘దేశముదురు’ (Desamuduru). పూరీజగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2007 లో రిలీజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ చేత పూరీ చెప్పించిన డైలాగ్స్ అందర్నీ అలరించాయి. ఈ సినిమాతోనే అల్లు అర్జున్ టాలీవుడ్ సిక్స్ ప్యాక్ కల్చర్ ని పరిచయం చేశాడు. ఈ మూవీ తరువాత చాలా మంది హీరోలు సిక్స్ ప్యాక్ చూపిస్తూ బన్నీని అనుసరిస్తూ వచ్చారు. యాపిల్ బ్యూటీ హన్సిక (Hansika Motwani) ఈ చిత్రంతో వెండితెరకు హీరోయిన్ గా పరిచయమైంది.
Pushpa 2 : పుష్ప రాజ్ వచ్చేస్తున్నాడు.. గుడ్ న్యూస్ చెప్పిన సుకుమార్!
ఇక ఈ సినిమాలో అలీ క్యారెక్టరైజేషన్ అందరి చేత నవ్వులు పూయించింది. చక్రి ఇచ్చిన సంగీతం ఇప్పటికీ చార్ట్ బస్టర్. ‘అట్టంటోడే ఇట్టంటోడే’ ఐటెం సాంగ్ లో బన్నీతో పాటు సీనియర్ హీరోయిన్ రబ్బ వేసిన స్టెప్పులు మాస్ ఆడియన్స్ ని ఒక ఊపు ఊపేశాయి. కాగా ఈ ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు ఉన్న సంగతి తెలిసిందే. ఈ పుట్టినరోజు సందర్భంగా దేశముదురు సినిమాని రీ రిలీజ్ చేసి ఈ ఏడాది బన్నీ బర్త్ డే ఇంకొంచెం స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు అభిమానులు. ఏప్రిల్ 6న ఈ మూవీ భారీ ఎత్తున్న రిలీజ్ అవుతుంది.
Allu Arjun: చరణ్ బర్త్ డే వేడుకల్లో కనిపించని అల్లు అర్జున్.. రీజన్ ఏమిటో చెప్పిన బన్నీ టీమ్!
అల్లు అర్జున్ కి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. దీంతో రీ రిలీజ్ కి కేరళ స్టేట్ లో కూడా అత్యధిక థియేటర్ లో దేశముదురు రిలీజ్ కాబోతుంది. ఇప్పటి వరకు తెలుగు హీరోలకు సంబంధించిన రీ రిలీజ్ లు కేరళలో ఒక ఏరియాలో మాత్రమే రిలీజ్ అయ్యాయి. కానీ దేశముదురు మాత్రం కేరళ స్టేట్ మొత్తం మీద రిలీజ్ కాబోతుంది. మొత్తం 50 షోలకు పైగా పడబోతున్నాయి. ఇంకా షోలు పెరిగే అవకాశం కూడా ఉంది అంటున్నారు. ఇక కేరళలో బన్నీ క్రేజ్ చూపిస్తూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
