×
Ad

Devi Sri Prasad: ‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్ కి దేవిశ్రీ స్టెప్పులు.. వీడియో మాత్రం ఒక రేంజ్ లో ఉంది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'దేఖ్ లేంగే సాలా' పాటకు అదిరిపోయే డాన్స్ చేసిన దేవి శ్రీ ప్రసాద్(Devi Sri Prasad).

Devi Sri Prasad Dance For Dekhlenge Saala Song

  • పవన్ పాటకు స్టెప్పులు వేసిన దేవి శ్రీ ప్రసాద్
  • విదేశీ వీధుల్లో ‘దేఖ్ లేంగే సలా’ అంటూ రచ్చ
  • సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్న వీడియో

Devi Sri Prasad: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో లేటెస్ట్ బ్యూటీస్ శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై అంచనాలు ఒక రేంజ్ లో నెలకొన్నాయి.

ఏప్రిల్ విడుదల కానున్న ఈ సినిమా నుంచి రీసెంట్ గా ‘దేఖ్ లేంగే సాలా’ అనే సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాట సోషల్ మీడియాలో రికార్డ్స్ క్రియేట్ చేసింది. చాలా గ్యాప్ తరువాత పవన్ కళ్యాణ్ డాన్స్ చేయడం, ఆయన స్టైలీష్ లుక్స్ సాంగ్ ను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాయి. అయితే, తాజాగా ఇదే సాంగ్ కి దేవి శ్రీ ప్రసాద్ కూడా స్టెప్స్ వేశాడు.

Kajal Agarwal: బ్లాక్ డ్రెస్సులో కాజల్ స్టన్నింగ్ లుక్స్.. ఫొటోలు

విదేశీ వీధుల్లో ‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్ స్టైలీష్ స్టెప్స్ వేస్తూ అదరగొట్టేశాడు దేవి శ్రీ ప్రసాద్(Devi Sri Prasad). ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు, దేవి చేసిన ఈ వీడియోకి కూడా ఒక రేంజ్ ఓ వ్యూస్ వస్తున్నాయి. ఇక దేవి ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టేజి ఎక్కడంటే తన మ్యూజిక్ అండ్ డాన్స్ తో కుమ్మేస్తాడు.

ఇప్పుడు అదే రేంజ్ లో మరోసారి ‘దేఖ్ లేంగే సాలా’ సాంగ్ కి స్టెప్స్ అదరగోటేశాడు దేవి. ఉస్తాద్ లో కేవలం ఈ ఒక్క సాంగ్ మాత్రమే కాదు మిగతా సాంగ్స్ కూడా ఒక రేంజ్ లో ఉండబోతున్నాయట. ఇక గతంలో పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ గబ్బర్ సింగ్ సినిమాకు కూడా దేవి శ్రీనే మ్యూజిక్ అందించాడు. ఇప్పుడు మరోసారి అదే కాంబోలో తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేయించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవి శ్రీ ప్రసాద్.