Kara OTT: ధనుష్ ‘కర’ ఓటీటీ డేట్ లాక్.. సాలిడ్ క్రైమ్ థ్రిల్లర్ స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

ధనుష్ కర మూవీ ఓటీటీ(Kara OTT) డేట్ లాక్ చేసిన నెట్‌ఫ్లిక్స్‌.

Dhanush Kara movie ott release date netflix confirmed

  • ధనుష్ ‘కర’ ఓటీటీ డేట్ ఫిక్స్.
  • నెట్‌ఫ్లిక్స్‌లో మే 28 నుండి స్ట్రీమింగ్.
  • సాలిడ్ బ్యాంక్ రాబరీ క్రైమ్ థ్రిల్లర్.

Kara OTT: తమిళ స్టార్ ధనుష్, ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు జంటగా నటించిన క్రేజీ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ‘కర(Kara OTT)’. థియేటర్లలో మంచి ఆదరణ పొందిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ సిద్ధం అయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో మే 28 నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్టు అధికారిక ప్రకటన వచ్చేసింది. ‘పోరుతొజిల్’ లాంటి సెన్సేషనల్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను అందించిన డైరెక్టర్ విఘ్నేష్ రాజా ఈ చిత్రాన్ని అద్భుతమైన బ్యాంక్ రాబరీ, లవ్ అండ్ ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కించారు. జయరామ్, కే.ఎస్. రవికుమార్ ఇందులో కీలక పాత్రలు పోషించారు.

Rukmini Vasanth: అది నేను కాదు.. బికినీ ఫొటోలపై రుక్మిణి వసంత్ ఆగ్రహం

కథ విషయానికి వస్తే: భార్య మల్లి (మమితా బైజు) కోసం దొంగతనాలు మానేసి, హోటల్ బిజినెస్ పెట్టాలనుకుంటాడు కరస్వామి (ధనుష్). పెట్టుబడి కోసం తండ్రి (కేఎస్ రవికుమార్) దగ్గరకు వెళ్లిన అతనికి అక్కడ ఊహించని ఘోర పరిణామాలు ఎదురవుతాయి. తన కళ్ల ముందే తండ్రిని కోల్పోయిన కర, ఆ తర్వాత ముత్తు సెల్వన్ బ్యాంకులను మాత్రమే ఎందుకు టార్గెట్ చేశాడు? చివరికి భార్యకు ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకున్నాడు? అనే ఆసక్తికరమైన అంశాలతో సాగే ఈ మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ డిజిటల్ ఆడియన్స్‌ను అలరించడానికి రెడీ అయిపోయింది.