Dhanush : పూర్తిగా టాలీవుడ్ పై ఫోకస్ చేస్తున్న ధనుష్.. సూర్య, కార్తీల తర్వాత ఆ రేంజ్ క్రేజ్ కోసం..
ధనుశ్ ఇప్పుడు ఆ ఫాలోయింగ్ కోసం తెగ ట్రై చేస్తున్నాడు. (Dhanush)
- Saketh U
- Published on- October 1, 2026 / 09:41 AM IST
Dhanush
Dhanush : సూపర్‌స్టార్ రజనీకాంత్ తర్వాత.. కోలీవుడ్ నుంచి తెలుగులో మంచి మార్కెట్ ఉన్న హీరోలుగా సూర్య, కార్తి కంటిన్యూ అవుతున్నారు. టాలీవుడ్ మార్కెట్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసిన దళపతి విజయ్, అజిత్‌కి ఆ రేంజ్ క్రేజ్ తెలుగులో సొంతం కాలేదు. సినిమా ఓపెనింగ్స్ వచ్చినా సూర్య, కార్తీ, రజినీకాంత్ కి ఉన్నంత తెలుగు ఫ్యాన్ ఫాలోయింగ్ అజిత్, విజయ్ లకు లేదనే చెప్పాలి. ధనుశ్ ఇప్పుడు ఆ ఫాలోయింగ్ కోసం తెగ ట్రై చేస్తున్నాడు.
పలు డబ్బింగ్ సినిమాలతో, రఘువరన్ బిటెక్, వడా చెన్నై.. లాంటి పలు సినిమాలతో తెలుగులో గుర్తింపు, కాస్త ఫేమ్ తెచ్చుకున్న ధనుష్ తెలుగులో కూడా సినిమాలు చేయడం ఎప్పుడో మొదలుపెట్టాడు. డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన సార్ సినిమాతో డైరెక్ట్ మొదటి తెలుగు సినిమాతోనే తన స్టామినాని ప్రూవ్ చేసుకున్నారు ధనుష్. శేఖర్ ఖమ్ముల దర్శకత్వంలో నటించిన కుబేర సినిమాతోనూ టాలీవుడ్ ఆడియెన్స్‌కి మరింత దగ్గరయ్యారు ధనుశ్. దీంతో తనకు తెలుగులో మొదటిగా సక్సెస్ అందించిన సితార బ్యానర్‌తో కలిసి తన 56వ సినిమాని పట్టాలెక్కించారు ఈ కోలీవుడ్ స్టార్ హీరో.
Also See : Anshu Selvamani : రోజా కూతురు అన్షు సెల్వమణి లేటెస్ట్ సెల్ఫీలు చూశారా..?
ధనుశ్ హీరోగా D56 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. శ్రీకర స్టూడియోస్, ప్రిమార్క్ ప్రొడక్షన్స్‌తో కలిసి ఈ ప్రస్టేజియస్ ప్రాజెక్ట్‌ని ప్రొడ్యూస్ చేస్తోంది సితార ఎంటర్‌టైన్మెంట్. ధనుష్ కెరీర్‌లో 56వ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాని విజయ్ బి కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రీతి ముకుందన్ ధనుశ్‌కి జోడీగా నటిస్తుండగా.. ఎస్.జే సూర్య విలన్‌గా ఫిక్స్ అయ్యారు. ఇక ధనుశ్ ఓం సినిమాకి మ్యూజిక్ అందిస్తోన్న యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్.. D56 సినిమాకి కూడా వర్క్ చేస్తున్నారు.
తమిళ హీరోలతో సినిమాలు సితార ఎంటర్‌టైన్మెంట్స్‌కి సైతం బాగా కలిసొస్తుంది. ఆల్రెడీ ధనుష్ తో సర్ సినిమా తీసి హిట్ కొట్టారు. అలాగే సూర్య హీరోగా నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా బాక్సాఫీస్ దగ్గర 250 కోట్ల గ్రాస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సక్సెస్‌ని కంటిన్యూ చేసేలా ధనుశ్‌తో D56 ప్రాజెక్ట్ పట్టాలెక్కించారు. ఈ సినిమాని 2027 సమ్మర్‌లో విడుదల చేస్తున్నట్లు రిలీజ్ టార్గెట్‌పై కూడా క్లారిటీ ఇచ్చింది టీమ్. మరి సార్, కుబేర సినిమాలతో టాలీవుడ్‌లో స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపించిన ధనుశ్.. ఈ D56 సినిమాతో ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటారో చూడాలి. ఇలా వరుసగా తెలుగు సినిమాలు, తెలుగు దర్శక, నిర్మాతలతో సినిమాలు చేసి ధనుష్ కూడా తెలుగులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ సాధిస్తారేమో చూడాలి.
