Dhurandhar 2 OTT: బ్లాక్ బస్టర్ ‘ధురంధర్ 2’ ఓటీటీ రిలీజ్ అప్డేట్.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

ధురంధర్ 2 ఓటీటీ(Dhurandhar 2 OTT) స్ట్రీమింగ్ డేట్ పై ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Dhurandhar 2 OTT release update

  • థియేటర్స్ లో ధురంధర్ 2 ప్రభంజనం
  • ఓటీటీ రిలీజ్ పై సోషల్ మీడియాలో చర్చ
  • మే నెలలో ఓటీటీలో రానున్న బ్లాక్ బస్టర్ మూవీ

Dhurandhar 2 OTT: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ‘ధురంధర్ 2’ ప్రభంజనం కొనసాగుతోంది. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే వసూళ్లతో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే రూ.1100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి, అతి తక్కువ సమయంలో ఈ రేర్ ఫీట్
సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సీక్వెల్, మొదటి భాగం కంటే రెట్టింపు స్థాయిలో ప్రేక్షకులను అలరించడమే కాకుండా, ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచే రీతిలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

Manchu Lakshmi: ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం.. ‘టీచ్ ఫర్ ఛేంజ్’ కోసం ర్యాంప్ వాక్ చేసిన స్టార్స్

యాక్షన్, ఎమోషన్, అద్భుతమైన మేకింగ్ వల్లే ఈ సినిమా గ్లోబల్ స్థాయిలో ఇంతటి ఘనవిజయాన్ని సాధించిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అయితే, థియేటర్ల వద్ద ఈ స్థాయిలో హవా కొనసాగిస్తుండగానే, ధురంధర్ 2 సినిమా ఓటీటీ విడుదలపై ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్(Dhurandhar 2 OTT) ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకే సొంతం చేసుకున్నట్లు సమాచారం.

సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాలు థియేటర్లలో విడుదలైన 50 రోజుల తర్వాతే ఓటీటీలోకి వస్తుంటాయి, కానీ ‘ధురంధర్ 2’ సాధించిన రికార్డ్ స్థాయి వసూళ్ల నేపథ్యంలో డిజిటల్ ప్రీమియర్ ఎప్పుడు ఉంటుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం థియేటర్స్ లో విడుదలైన సరిగ్గా 50 రోజులకి ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారట. అంటే, మే 1 లేదా 7న ధురంధర్ 2 ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన, స్ట్రీమింగ్ తేదీపై నెట్‌ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.