Dhurandhar 2: బాక్సాఫీస్ సునామీ.. 7 రోజుల్లోనే రూ.1000 కోట్లు.. చరిత్ర సృష్టించిన ‘ధురంధర్-2’
కేవలం వారం రోజుల్లోనే రూ.1000 కోట్ల వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది ధురంధర్ 2(Dhurandhar 2) మూవీ.
- V Santhosh Kumar
- Published On : March 27, 2026 / 07:13 AM IST
Dhurandhar 2 sets new record breaking in 1,000 crore within just one week.
- చరిత్ర సృష్టించిన ధురంధర్ 2 మూవీ
- వారం రోజుల్లోనే వెయ్యి కోట్లు
- మరో రెండు రోజుల్లో పుష్ప రికార్డ్స్ అవుట్
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో గతంలో ఎన్నడూ లేని విధంగా ‘ధురంధర్-2’ సరికొత్త రికార్డులను సృష్టిస్తూ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన కేవలం ఏడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి, అత్యంత వేగంగా రూ.1000 కోట్లు కొల్లగొట్టిన తొలి భారతీయ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. విడుదలకు ముందు ఏర్పడిన భారీ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అందుకోవడమే కాకుండా, ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురి చేస్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
సాధారణంగా ఏ సినిమాకైనా వీక్ డేస్‌లో వసూళ్లు తగ్గడం జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ సినిమా సోమవారం నుండి బుధవారం వరకు కూడా అదే జోరును కొనసాగించడం విశేషం. గతంలో ‘పుష్ప-2’ చిత్రం హిందీ వెర్షన్‌లో మొదటి వారంలో రూ.425 కోట్ల నెట్ వసూళ్లతో నెలకొల్పిన రికార్డును ‘ధురంధర్-2’ అధిగమించింది. ఒకే భాషలో అతి తక్కువ సమయంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.
Rashmi Gautam: కాశీ విశ్వేశ్వరుడి సేవలో యాంకర్ రష్మీ.. డివోషనల్ ఫొటోలు వైరల్
తాజా లెక్కల ప్రకారం, వెయ్యి కోట్ల మార్కును అందుకున్న 10వ భారతీయ చిత్రంగా ‘ధురంధర్-2’ నిలిచింది. కేవలం భారతదేశంలోనే ఈ సినిమా వారం రోజుల్లో రూ.745 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. బాలీవుడ్ చిత్రాల్లో ఇంత తక్కువ కాలంలో ఈ స్థాయి వసూళ్లు సాధించిన ఏకైక సినిమా ఇదే కావడం గమనార్హం. ప్రస్తుతం భారతీయ బాక్సాఫీస్ వద్ద రూ.1471 కోట్ల రూపాయల గ్రాస్‌తో ‘పుష్ప-2’ టాప్ పొజిషన్ లో ఉంది.
అయితే, ‘ధురంధర్-2’ దూకుడు చూస్తుంటే ఈ రికార్డును అధిగమించడం పెద్ద కష్టమేమీ కాదని ట్రేడ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. హిందీలో మాత్రమే కాదు దక్షిణాది భాషల్లో కూడా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో, మరో మూడు రోజుల్లోనే భారతదేశపు బిగ్గెస్ట్ గ్రాసర్‌గా ‘ధురంధర్-2’ అవతరించడం ఖాయంగా కనిపిస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సృష్టిస్తున్న సునామీ మరిన్ని పాత రికార్డులను తుడిచిపెట్టే దిశగా దూసుకుపోతోంది.
