Tollywood Diesel Shortage: డీజిల్ కొరత ఎఫెక్ట్.. టాలీవుడ్ షూటింగ్స్ కి అంతరాయం..

Diesel Shortage Impact Tollywood: ఈ డీజిల్ కొరత సినీ పరిశ్రమని కూడా తాకింది. (Tollywood)

  • Updated on- April 28, 2026 / 05:18 PM IST

Diesel Shoratage Effect On Tollywood Shootings

Tollywood-Diesel : ఇరాన్ – అమెరికా యుద్ధం మన దేశంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ రంగాలపై భారీ ఎఫెక్ట్ చూపిస్తుంది. మొన్నటివరకు కమర్షియల్ గ్యాస్ దొరక్క హోటల్స్, రెస్టారెంట్స్ ఇబ్బంది పడ్డాయి. ఆ దెబ్బకు తినే పదార్థాలు రేట్లు కూడా పెంచారు. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ కొరత వస్తుంది. ఇప్పటికే చాలా చోట్ల పెట్రోల్ లేదు అని నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు పెట్రోల్ బంక్స్ లో.

ఈ డీజిల్ కొరత సినీ పరిశ్రమని కూడా తాకింది. సినీ పరిశ్రమలో అవుట్ డోర్ షూటింగ్స్ జరగాలంటే కచ్చితంగా డీజిల్ కావాల్సిందే. భారీ లైటింగ్స్ కావాలంటే డీజిల్ జనరేటర్లనే వాడతారు. అవుట్ డోర్ లో అయితే లైటింగ్ కి, కరెంట్ కి కచ్చితంగా డీజిల్ జనరేటర్లనే వాడతారు. ఇక సెలబ్రిటీలు వాడే కారవాన్స్ కి కూడా డీజిల్ కావాల్సిందే.

Also See :  సమంత బర్త్ డే స్పెషల్.. సీక్రెట్ ఫొటోలు షేర్ చేసిన డైరెక్టర్..

సోమవారం నాడు హైదరాబాద్ లో డీజిల్ కొరత ఏర్పడటంతో కొన్ని సినిమా, సీరియల్ షూటింగ్స్ అర్దాంతరంగా ఆగిపోయాయని సమాచారం. డీజిల్ లేకపోతే అవుట్ డోర్ లో జరిగే లైటింగ్స్ పెట్టలేరు. కావాల్సిన లైటింగ్ సెటప్ లేకపోతే షూటింగ్ జరగదు. ఇక టీవీ షోలకు కూడా ఫ్లోర్స్ లో ఏసీ కోసం డీజిల్ జనరేటర్లనే వాడతారు. అవి కూడా ఎఫెక్ట్ అయింది. అన్ని వైపులా మూసేసి ఉండే పెద్ద పెద్ద సెట్స్ లో ఏసీ లేకపోతే చెమటలు కక్కుతూ ఉండాల్సిందే.

ఇలా సినీ పరిశ్రమలో షూటింగ్స్ కి డీజిల్ కచ్చితంగా కావాల్సిందే. రోజూ వేల లీటర్ల డీజిల్ టాలీవుడ్ లో వాడతారు. ఈ డీజిల్ ఎఫెక్టుతో షూటింగ్స్ ఆగిపోతే నిర్మాతలకు నష్టం, సినిమాలు వాయిదా తప్పదు.

Also Read : సమంత బర్త్ డే స్పెషల్.. ఇప్పుడైనా ‘బంగారం’ హిట్ కొడుతుందా?