Samantha : సమంత బర్త్ డే స్పెషల్.. ఇప్పుడైనా ‘బంగారం’ హిట్ కొడుతుందా?
ఆ తర్వాత ఇప్పటివరకు సమంత హిట్ అనే మాటే వినలేదు. (Samantha)
Samantha
Samantha : నేడు సమంత పుట్టిన రోజు కావడంతో సెలబ్రిటీలు, ఫ్యాన్స్, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో సమంత ఒక్క కమర్షియల్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోయిన్ అయింది సమంత. తమిళ్, తెలుగులో చాలా మంది స్టార్ హీరోలతో సినిమాలు చేసి భారీ విజయాలే సాధించింది. కానీ అదంతా ఒకప్పుడు. ఇప్పుడు మాత్రం సమంత కమర్షియల్ థియేటరికల్ హిట్ కొట్టి చాలా కాలమే అయింది.
మధ్యలో విడాకులు, ఆరోగ్య సమస్యలతో సినిమాలకు దూరమయింది. ఆ తర్వాత బిజినెస్ లతో బిజీ అయి సినిమాలకు గ్యాప్ ఇస్తూ వస్తుంది. సమంత చివరగా 2019 లో సూపర్ డీలక్స్, మజిలీ, ఓ బేబీ.. మూడు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టింది. ఆ తర్వాత ఇప్పటివరకు సమంత హిట్ అనే మాటే వినలేదు.
Also See : Anshumalika : అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రోజా కూతురు అన్షు.. ఫొటోలు..
2019 చివర్లో నాగార్జున మన్మధుడు 2 సినిమాలో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చింది. ఆ సినిమా డిజాస్టర్ అయింది. 2020లో తమిళ్ 96 సినిమాని రీమేక్ చేసి జాను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో సమంత నటనకు అభినందనలు వచ్చాయి కానీ డబ్బులు రాలేదు. ఇక తమిళ్ లో నయనతారతో కలిసి కాత్తువకుల రెండు కాదల్ సినిమా చేసింది. ఆ సినిమా కూడా యావరేజ్ గానే నిలిచింది. ఆ తర్వాత ఓ హాలీవుడ్ సినిమాని ఆధారంగా తీసుకొని తెరకెక్కిన యశోద అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న శాకుంతలం సినిమా డిజాస్టర్ అయింది. విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా చేసినా ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఇలా దాదాపు ఆరేళ్లుగా సమంత మెయిన్ లీడ్ లో, హీరోయిన్ గా చేసిన ఒక్క సినిమా కూడా కమర్షియల్ గా హిట్ అవ్వలేదు.
Samantha
ఈ మధ్యలో అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసి ఒక్కసారిగా పాపులారిటీ తెచ్చుకుంది. బాలీవుడ్ వెళ్లి సిటాడెల్ సిరీస్ చేసినా అది తెలుగు, తమిళ్ లో అంత కనెక్ట్ అవ్వలేదు. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో చిన్న కీలక పాత్ర చేసింది. ఆ సిరీస్ మీద ఉన్న అంచనాలతో, సమంత పర్ఫార్మెన్స్ తో దాంట్లో మాత్రం పేరు తెచ్చుకుంది.
ఇక హెల్త్ సెట్ అయ్యాక రీ ఎంట్రీలో నిర్మాతగా శుభం అనే సినిమాతో వచ్చింది. ఈ సినిమా కమర్షియల్ గా పర్వాలేదనిపించింది కానీ ఆ సినిమాలో తాను చేసిన గెస్ట్ రోల్ కి మాత్రం విమర్శలే వచ్చాయి. ప్రస్తుతం సమంత తనకు అచ్చొచ్చిన డైరెక్టర్, తన ఫ్రెండ్ నందిని రెడ్డి దర్శకత్వంలో మా ఇంటి బంగారం అనే సినిమా చేస్తుంది. ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ఆసక్తికరంగా అనిపించింది. ఈ సినిమా మే 15న రిలీజ్ కానుంది. ఇది కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమానే. అయితే 15 రోజుల్లో ఈ సినిమా రిలీజ్ ఉన్నా కావాల్సినంత హైప్ సినిమాకు ఇంకా రాలేదు. సమ్మర్ లో ఎలాంటి పెద్ద సినిమాలు లేవు కాబట్టి సమంత మా ఇంటి బంగారం సినిమాను గట్టిగా ప్రమోట్ చేస్తే కమర్షియల్ గా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అసలే ఈ సినిమాని సమంతే నిర్మిస్తుంది. మరి సమంత రీ ఎంట్రీలో వస్తున్న మా ఇంటి బంగారం సినిమా థియేటర్స్ లో కమర్షియల్ హిట్ కొడుతుందా? ఫ్యాన్స్ ని మెప్పిస్తుందా చూడాలి.
సమంత ఇటీవల రాజ్ నిడిమోరుని కొన్ని నెలల క్రితం రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. సమంత ఎక్కువగా తన బిజినెస్ లపైనే దృష్టి పెడుతుంది. అసలు సమంత కమర్షియల్ సినిమాలు చేస్తుందా? మళ్ళీ హీరో పక్కన హీరోయిన్ గా సినిమాలు చేస్తుందా? కేవలం లేడీ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తుందా ఇకపై అనే సందేహాలు కూడా వస్తున్నాయి. దీంతో ఫ్యాన్స్ మా ఇంటి బంగారం హిట్ అయి మళ్ళీ సమంత మార్కెట్ పెరగాలని, సమంత మళ్ళీ సినిమాలపై, కథలపై దృష్టి పెట్టాలని, వరుసగా సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. ఈ బర్త్ డే తర్వాత వచ్చే సమంత మా ఇంటి బంగారం సినిమా, పెళ్లి తర్వాత వచ్చే మొదటి సినిమా సమంతకు ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.
