×
Ad

Dil Raju : టాలీవుడ్ లో మరో పెళ్లి.. దిల్ రాజు ఇంట పెళ్లి సందడి?

దిల్ రాజు సోదరుడు శిరీష్ కూడా నిర్మాణ రంగంలోకి వచ్చి దిల్ రాజుతో కలిసి పనిచేస్తున్నారు. శిరీష్ తనయుడు ఆశిష్(Ashish) ఇటీవల రౌడీ బాయ్స్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

  • Published On : October 28, 2023 / 11:24 AM IST

Dil Raju Brother Son Ashish Reddy will Marry Soon Rumours Goes Viral

Dil Raju : ఇటీవల టాలీవుడ్ లో వరుస పెళ్లి వేడుకలు సిద్ధమవుతున్నాయి. వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి నవంబర్ 1న పెళ్లి చేసుకోబోతున్నారు. ఇటీవలే వెంకటేష్ రెండో కూతురు నిశ్చితార్థం కూడా జరిగింది. మరోవైపు కీరవాణి తనయుడు శ్రీసింహ పెళ్లి కూడా మురళీమోహన్ మనవరాలు రాగతో జరగబోతున్నట్టు సమాచారం. తాజాగా టాలీవుడ్ లో మరో పెళ్లి జరగబోతున్నట్టు తెలుస్తుంది.

డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ మొదలుపెట్టి టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా ఎదిగారు దిల్ రాజు. వరుస భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు దిల్ రాజు. దిల్ రాజు సోదరుడు శిరీష్ కూడా నిర్మాణ రంగంలోకి వచ్చి దిల్ రాజుతో కలిసి పనిచేస్తున్నారు. శిరీష్ తనయుడు ఆశిష్(Ashish) ఇటీవల రౌడీ బాయ్స్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. త్వరలోనే సెల్ఫిష్ అనే మరో సినిమాతో కూడా రాబోతున్నాడు. ఇంకో సినిమా కూడా అనౌన్స్ చేశాడు. అయితే త్వరలోనే ఆశిష్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్టు తెలుస్తుంది.

Also Read : Detective Teekshana : ఉపేంద్ర భార్య 50వ సినిమా ‘డిటెక్టివ్ తీక్షణ’ ఫస్ట్ సాంగ్ రిలీజ్.. రేజ్ ఆఫ్ తీక్షణ..

కొన్ని రోజుల క్రితమే దిల్ రాజు వాళ్ళ నాన్న మరణించారు. చావు జరిగిన ఇంట్లో శుభకార్యం జరిగితే మంచిదని అంటారు. దీంతో దిల్ రాజు సోదరుడు కొడుకైన ఆశిష్ కి పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఏపీకి చెందిన ఓ వ్యాపారవేత్త కూతురితో ఆశిష్ వివాహం జరగనుందని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన లేకపోయినా, ఇప్పటికే పెళ్లి మాటలు మాట్లాడుకున్నట్టు టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది.