Photo Credits : Hanshithareddy Instagram
Dil Raju : డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ నిర్మాతగా దూసుకుపోతున్నారు దిల్ రాజు. భారీ బడ్జెట్ సినిమాలతో పాటు చిన్న సినిమాలను కూడా తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి కూడా నిర్మాతగా వ్యవహరిస్తోంది.
తాజాగా దిల్ రాజు మనవరాలు, హన్షిత రెడ్డి కూతురు ఇషికకు శారీ ఫంక్షన్ చేశారు.
హన్షిత రెడ్డికి ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. తాజాగా ఇషిక శారీ ఫంక్షన్ ఈవెంట్ కు సంబంధించిన ఫొటోలు హన్షిత సోషల్ మీడియాలో షేర్ చేసింది.
దీంట్లో ఫ్యామిలీ ఫోటోలు కూడా ఉండటంతో దిల్ రాజు మనవడు ఆరాంశ్, మనవరాలు ఇషిక ఫోటోలు వైరల్ గా మారాయి.
హన్షిత, ఆమె భర్త, ఇద్దరు పిల్లలు ఉన్న ఫొటో వైరల్ గా మారింది.
ఇక దిల్ రాజు కరోనా సమయంలో రెండో పెళ్లి చేసుకోగా వీరికి ఒక కొడుకు పుట్టిన సంగతి తెలిసిందే.