Pawan Kalyan : OG 2 పక్కన పెట్టేసి పవన్ – దిల్ రాజు సినిమా..? ఆ డైరెక్టర్ తో..
పవన్ కళ్యాణ్ - దిల్ రాజు కాంబోలో గతంలో పవన్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ వచ్చి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. (Pawan Kalyan)
Pawan Kalyan
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ OG సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి పవర్ స్టార్ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపాడు. దీనికి పార్ట్ 2 కూడా అధికారికంగా ప్రకటించారు. అయితే సుజీత్ ప్రస్తుతం నానితో బ్లడీ రోమియో సినిమా చేస్తుండటంతో ఆ సినిమా అయ్యాక OG 2 ఉంటుందని తెలుస్తుంది. దీంతో పవన్ నెక్స్ట్ సినిమా ఏంటి అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
పవన్ కళ్యాణ్ హీరోగా రామ్ తాళ్లూరి నిర్మాణంలో సురేందర్ రెడ్డితో సినిమా అనౌన్స్ చేశారు కానీ అది ఉందో లేదో కూడా క్లారిటీ లేదు. తాజాగా పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమాపై ఆసక్తికర సమాచారం వినిపిస్తుంది. దిల్ రాజు నిర్మాణంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఒక సినిమా రాబోతుంది. ఇప్పటికే దిల్ రాజు ఈ ప్రాజెక్టుని ఫైనల్ చేసారని వినిపిస్తుంది.
Also Read : RC 17 : నేడే ఓపెనింగ్.. RC17 రిలీజ్ ఎప్పుడంటే.. మెగా ఫ్యాన్స్ ఎన్నాళ్ళు ఎదురు చూడాలి..?
వంశీ పైడిపల్లి దర్శకుడిగా పవన్ కళ్యాణ్ హీరోగా అర్జున అనే టైటిల్ తో పాన్ ఇండియా యాక్షన్ సినిమాని ప్లాన్ చేస్తున్నారట దిల్ రాజు. వంశీ పైడిపల్లి ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో హిందీలో దిల్ రాజు నిర్మాణంలోనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా 2027 రంజాన్ కి రిలీజ్ అవ్వనుంది. అది అయ్యాక వెంటనే పవన్ కళ్యాణ్ తో దిల్ రాజు, వంశీ పైడిపల్లి సినిమా చేస్తారని తెలుస్తుంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన అయితే లేదు. మరి ఈ సినిమా ఉంటుందా లేక అనౌన్స్మెంట్స్ దగ్గరే ఆగిపోతుందా చూడాలి.
పవన్ కళ్యాణ్ – దిల్ రాజు కాంబోలో గతంలో పవన్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ వచ్చి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.
