×
Ad

Dil Raju : ‘ఫ్యామిలీ స్టార్’ రివ్యూల కోసం.. స్వయంగా మైక్ పట్టుకొని థియేటర్స్ ముందుకెళ్లిన దిల్ రాజు..

తాజాగా దిల్ రాజు 'ఫ్యామిలీ స్టార్' సినిమా ప్రమోషన్స్ కోసం మరో అవతారం ఎత్తారు.

  • Published On : April 7, 2024 / 06:50 AM IST

Dil Raju Turned as Anchor for Family Star Movie Reviews

Dil Raju : విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) జంటగా పరుశురాం దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ఫ్యామిలీ స్టార్(Family Star). ఏప్రిల్ 5న రిలీజయిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించింది. ఈ సినిమాకి దిల్ రాజు & టీం బాగా ప్రమోషన్స్ చేసారు. ఎప్పుడూ లేని రేంజ్ లో దిల్ రాజు అన్నీ తానై ఈ సినిమాని నడిపించాడు. థియేటర్స్ లో రిలీజయ్యాక కూడా ఈ సినిమా ప్రమోషన్స్ తెగ చేసేస్తున్నారు దిల్ రాజు & మూవీ టీం.

ప్రతి ఫ్యామిలీలోను వాళ్ళ ఫ్యామిలీ కోసం కష్టపడేవాళ్లు, వాళ్ళ ఫ్యామిలీని పైకి తీసుకొచ్చే వాళ్ళు ఒక ఫ్యామిలీ స్టార్ ఉంటారని, ఆ ఫ్యామిలీ స్టార్ ని కలుస్తామని, తెలుగు రాష్ట్రాల్లో పలు ఫ్యామిలీలని కలుస్తామని ఇప్పటికే దిల్ రాజు తెలిపారు. తాజాగా దిల్ రాజు సినిమా ప్రమోషన్స్ కోసం మరో అవతారం ఎత్తారు.

Also Read : Indian 2 : అవినీతిని పూర్తిగా నిర్మూలించడం కోసం భారతీయుడు సిద్ధం..

ఏదైనా సినిమా రిలీజయితే థియేటర్స్ బయట మైక్ పట్టుకొని ఆడియన్స్ రివ్యూల కోసం పలువురు పడిగాపులు కాస్తారు. తాజాగా ఫ్యామిలీ స్టార్ సినిమా కోసం దిల్ రాజు మైక్ పట్టుకొని పలు థియేటర్స్ వద్ద ఆడియన్స్ రివ్యూలు తీసుకున్నారు. నిన్న రాత్రి హైదరాబాద్ లోని పలు థియేటర్స్ వద్ద దిల్ రాజు స్వయంగా వెళ్లి మైక్ పట్టుకొని సినిమా చూసి బయటకు వచ్చే ఆడియన్స్ వద్ద ఫ్యామిలీ స్టార్ సినిమా ఎలా ఉంది అని ప్రశ్నించి స్వయంగా రివ్యూలు తీసుకున్నారు. దీంతో దిల్ రాజు ఇలా రివ్యూలు తీసుకునే ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.