Epic Teaser: టీజర్ చూసి తప్పుగా అనుకోకండి.. ఇది పక్కా ఫ్యామిలీ మూవీ.. ఆదిత్య హాసన్ ఆసక్తికర కామెంట్స్

ఎపిక్ సినిమా టీజర్‌(Epic Teaser)లోని రొమాన్స్‌పై దర్శకుడు ఆదిత్య హసన్ ఆసక్తికర వ్యాఖ్యలు.

Director Aditya Hasan interesting comments on romance in Epic movie teaser.

  • ఆనంద్, వైష్ణవిల ‘ఎపిక్’ టీజర్ రిలీజ్.
  • ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్.
  • దర్శకుడు ఆదిత్య హాసన్ క్లారిటీ.

Epic Teaser: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఎపిక్’. ’90’స్’ వెబ్ సిరీస్ దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన ఈ చిత్ర టీజర్(Epic Teaser) యూత్‌ఫుల్ ఎలిమెంట్స్‌తో, కలర్‌ఫుల్‌గా సాగుతూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆనంద్, వైష్ణవిల మధ్య కెమిస్ట్రీ మరోసారి మ్యాజిక్ చేయబోతున్నట్లు టీజర్ ద్వారా స్పష్టమవుతోంది.

Tumbbad 2: హస్తర్ మళ్ళీ వస్తున్నాడు.. ‘తుంబాడ్ 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. బాక్సాఫీస్ వద్ద భయం మొదలు!

టీజర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు ఆదిత్య హాసన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. టీజర్‌లో కొన్ని రొమాంటిక్ సీన్స్ కనిపించినప్పటికీ, ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ఆయన స్పష్టం చేశారు. ’90’స్ – మిడిల్ క్లాస్ బయోపిక్’ లాగే ఈ సినిమాను కూడా చాలా రియలిస్టిక్‌గా తెరకెక్కించినట్లు ఆయన తెలిపారు. టీజర్‌లో కనిపించే ఆ కొన్ని ఘాటు సన్నివేశాల గురించి ప్రస్తావిస్తూ.. ప్రేక్షకులు కేవలం రెండు మూడు నిమిషాలు తల తిప్పుకుంటే సరిపోతుందని, అంతకు మించి సినిమాలో అసభ్యత ఏమీ ఉండదని ఆయన తనదైన శైలిలో చమత్కరించారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ టీజర్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో వెంకట్ ఉప్పుటూరి, వి.ఎం.ఆర్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా త్వరలోనే థియేటర్లలోకి రానుంది. ఆదిత్య హాసన్ మార్క్ ఎమోషన్స్, హ్యూమర్‌తో కూడిన ఈ ‘ఎపిక్’ కథ, ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యువతకు కూడా బాగా కనెక్ట్ అవుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. బేబీ హిట్ తర్వాత ఈ జోడి నటిస్తున్న సినిమా కావడం వల్ల బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ మరోసారి సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది.