BuchiBabu Sana: ‘పెద్ది’ ట్రైలర్ పై ట్రోలింగ్.. అయితే సరైన దారిలోనే ఉన్నాం.. బుచ్చిబాబు ఫన్నీ కామెంట్స్
పెద్ది ట్రైలర్ పై జరిగిన ట్రోలింగ్ పై ఆసక్తికర కామెంట్స్ చేసిన దర్శకుడు బుచ్చిబాబు(BuchiBabu Sana).
- V Santhosh Kumar
- Updated on- June 2, 2026 / 08:42 PM IST
Director Buchi Babu Sana makes interesting comments on Ram Charan peddi trailer.
- ట్రైలర్‌పై బుచ్చిబాబు కీలక వివరణ ఇచ్చారు.
- కథ వినగానే చరణ్ ఓకే చెప్పారు.
- హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను ఎంపిక చేశారు.
BuchiBabu Sana: ‘ఉప్పెన’ వంటి అందమైన ప్రేమకథ తర్వాత దర్శకుడు బుచ్చిబాబు(BuchiBabu Sana) స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషనల్ కథాంశంతో తెరకెక్కించిన చిత్రం ‘పెద్ది’. గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ కథానాయకుడిగా నటించిన ఈ భారీ చిత్రం ఈనెల 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగా ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే సినిమా పాటలకు వచ్చిన భారీ రెస్పాన్స్‌తో పోలిస్తే, ట్రైలర్‌కు మిశ్రమ స్పందన రావడంపై కాస్త కలవర పరిచింది. ఈ విషయం పెద్ది టీం వరకు కూడా వెళ్లిందట. తాజా జరిగిన ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు బుచ్చిబాబు ఈ విషయంపై స్పందించారు.
ట్రైలర్‌లోనే కథను ఎక్కువగా చూపిస్తే థియేటర్స్ లో ఆ ఉత్కంఠ తగ్గిపోతుందనే ఉద్దేశంతోనే అలా చేశామని బుచ్చిబాబు వివరించారు. సినిమాలోని అత్యంత కీలకమైన 50 నిమిషాల ఫుటేజీని ట్రైలర్ కోసం అసలు తాకనే లేదని, అందుకే ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ ఇందులో కనిపించలేదని పేర్కొన్నారు. గతంలో ఘన విజయం సాధించిన ఎన్నో చిత్రాల ట్రైలర్లు కూడా ఆరంభంలో యావరేజ్‌గానే అనిపించాయని, కాబట్టి తాము సరైన దారిలోనే వెళ్తున్నామని నవ్వుతూ నమ్మకం వ్యక్తం చేశారు.
ఇక ఈ సినిమా కథను తాను ‘ఉప్పెన’ విడుదల కాకముందే సిద్ధం చేసుకున్నానని బుచ్చిబాబు వెల్లడించారు. రామ్‌చరణ్‌కు ఈ కథ వినిపించగా, ఆయన చిన్న మార్పు కూడా చెప్పకుండా వెంటనే ఓకే అన్నారని గుర్తుచేసుకున్నారు. అలాగే ఈ ప్రాజెక్ట్ కోసం మొదట ఖుషీ కపూర్‌ను అనుకున్నప్పటికీ, ఆమె మరీ చిన్నమ్మాయిలా కనిపిస్తుందనే కారణంతో.. చివరకు ఆమె సోదరి, ప్రముఖ నటి జాన్వీ కపూర్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు స్పష్టం చేశారు.
