Director Harish Shankar counters the trolling going on against sreeleela
Sreeleela: సాధారణంగా ఏ ఇండస్ట్రీలో అయిన విజయమే ఆ వ్యక్తి యొక్క ఎదుగుదలను డిసైడ్ చేస్తుంది. ఇక సినిమా ఇండస్ట్రీలో అయితే చాలా ఎక్కువ. ఇక్కడ విజయాలు వస్తేనే అవకాశాలు వస్తాయి. లేదంటే తీసి పక్కన పెట్టేస్తారు. కానీ, విజయాలకు అతీతంగా ఇండస్ట్రీలో రాణిస్తోంది లేటెస్ట్ బ్యూటీ శ్రీలీల. పెళ్లి సందD సినిమాతో తెలుగునాట అడుగుపెట్టిన ఈ బ్యూటీ రవి తేజతో చేసిన ధమాకా సినిమాతో ఫస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంది.
దాంతో, ఆ తరువాత స్టార్ హీరోలతో వరుస అవకాశాలు అందుకుంది. కానీ, పాపం సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. ధమాకా తరువాత శ్రీలీల(Sreeleela) ఏకంగా డజను సినిమాల కన్నా ఎక్కువే చేసింది. కానీ, వాటిలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా హిట్ అవలేదు. ఈ మధ్యే తమిళ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. కానీ, అక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్. దాంతో, శ్రీలీలపై ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది.
Janhvi Kapoor: జాన్వీ కపూర్ బర్త్ డే.. పెద్ది నుంచి అచ్చియమ్మ స్పెషల్ వీడియో
ఆమెతో సినిమాలు చేస్తే అంతే సంగతులు అనే పరిస్థితి వచ్చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఈ సినిమాను డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు. భారీ అంచనాలున్న ఈ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, శ్రీలీల ఐరన్ లెగ్ సెంటిమెంట్ వల్ల ఈ సినిమా కూడా ప్లాప్ అవుతుంది అంటూ కొంతమంది నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.
ఈ ట్రోలింగ్ హరీష్ శంకర్ వద్దకు వెళ్లడంతో ఆయన తాజాగా స్పందించాడు. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. నేను సోషల్ మీడియా చూస్తున్నాను. చాలా మంచి శ్రీలీలను ఐరన్ లెగ్ అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా.. ఇంతకాలం డాన్స్ చేసే శ్రీలీలనే చూసి ఉంటారు. ఈ సినిమాలో డాన్స్ ఠీ పాటు ఎమోషనల్ సీన్స్ లో కూడా అదరగొట్టేసింది శ్రీలీల. ఈ సినిమా నుంచి ఆమె గోల్డెన్ లెగ్ అవుతుంది అంటూ అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. దీంతో, దర్శకుడు హరీష్ శంకర్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ఈ సినిమా విజయం సాధించి శ్రీలీలకు విజయాన్ని అందిస్తుందా అనేది చూడాలి.