×
Ad

Balakrishna- Koratala: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. దేవర 2 కాదు.. బాలయ్యతో చేస్తున్నాడు

దేవర 2 కాకుండా బాలకృష్ణతో సినిమా ప్లే చేస్తున్న దర్శకుడు కొరటాల శివ(Balakrishna- Koratala).

Director Koratala Siva planning a movie with Balakrishna.

  • ఆలస్యం కనున్న దేవర 2
  • బాలకృష్ణతో సినిమా చేయనున్న కొరటాల శివ
  • ఉగాదికి మొదలుకానున్న సినిమా

Balakrishna- Koratala: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది దేవర 2 అనే చెప్పాలి. దేవర క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మాస్ అవతార్ లో ఆడియన్స్ ను ఒక రేంజ్ లో మెప్పించాడు ఎన్టీఆర్. అందుకే, దేవర 2పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే, ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది.

ఈ నేపధ్యంలోనే దేవర చిత్ర నిర్మాత ఈ మధ్య చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఎన్టీఆర్ వరుసగా కొత్త కమిట్మెంట్స్ ఇస్తుండటంతో దేవర పార్ట్ 2 క్యాన్సిల్ అయ్యింది అని చాలా మంది అనుకున్నారు. ఆ విషయంలో ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అయ్యారు. కానీ. ఈ మధ్య ఓ ఈవెంట్ లో పాల్గొన్న దేవర నిర్మాత సుధాకర్ మిక్కిలినేని మాట్లాడుతూ జూన్ నుంచి దేవర పార్ట్ 2 షూటింగ్ మొదలవుతుంది అని చెప్పుకొచ్చాడు.

The Rajasaab OTT: రేపే ఓటీటీలోకి ‘ది రాజాసాబ్’.. ఎక్స్టెండెడ్ కట్ తో సరికొత్తగా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఆంతో, దేవర పార్ట్ 2పై ఎన్టీఆర్ అభిమానుల్లో ఆశలు చిగురించాయి. కానీ, తాజాగా వినిపిస్తున్న న్యూస్ మాత్రం వాళ్ళని మళ్ళీ కన్ఫ్యూజన్ లోకి నెట్టేసింది. అదేంటంటే, కొరటాల శివ నిర్మాత నాగ వంశీ కాంబోలో ఒక సినిమా రానుందట. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ(Balakrishna- Koratala) హీరోగా నటించనున్నాడట. నాగవంశీ, బాలకృష్ణ కాంబోలో గతంలో డాకు మహారాజ్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే.

భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా నాగవంశీ అనుకున్నంత విజయం సాధించలేదు. అందుకే, ఎలాగైనా బాలకృష్ణతో హిట్ సినిమా చేయాలనీ ఫిక్స్ అయ్యాడట నాగవంశీ. అందుకే, కొరటాల శివ, బాలకృష్ణ కాంబోలో మాస్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం దీనికి సంబందించిన కథ చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఉగాది రోజున ఈ సినిమాను భారీగా అనూన్స్ చేయాలని భావిస్తున్నారట మేకర్స్. ఎలాగూ ఎన్టీఆర్ చేస్తున్న డ్రాగన్ సినిమా రిలీజ్ కి ఇంకా టైం ఉంది కాబట్టి ఆలోపు బాలకృష్ణతో సినిమా ఫినిష్ చేయాలనీ చూస్తున్నాడట కొరటాల.