Rajamouli: ధురంధర్ 2పై రాజమౌళి రివ్యూ.. వైరల్ అవుతున్న సుదీర్ఘ పోస్ట్

ధురంధర్ 2 సినిమాపై ప్రశంసల వర్షం కురిపించిన దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli).

Director Rajamouli Praises Dhurandhar 2 movie

  • ధురంధర్ 2 సినిమా చూసిన రాజమౌళి
  • ఆదిత్య ధర్ గట్స్ ని మెచ్చుకోవాలి అంటూ కామెంట్స్
  • రణవీర్ సింగ్ నటనపై ప్రశంసలు కురిపించిన జక్కన్న

Rajamouli: బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధర్ కాంబోలో వచ్చిన ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఉగాది కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, సినీ ప్రముఖుల నుంచి ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు వంటి స్టార్లు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించగా, తాజాగా దర్శకధీరుడు రాజమౌళి సోషల్ మీడియా వేదికగా ఈ చిత్రంపై తన రివ్యూను పంచుకున్నారు. ఈ సినిమా మేకింగ్, నటీనటుల ప్రతిభను అభినందిస్తూ సుదీర్ఘ పోస్ట్ పెట్టాడు జక్కన్న(Rajamouli).

Kavya kalyanram: క్యూట్ లుక్స్ తో కవ్విస్తున్న కావ్య కళ్యాణ్ రామ్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్

ధురంధర్ మొదటి భాగం నాకు చాలా నచ్చింది. దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘ధురంధర్: ది రివెంజ్’లోనూ ఎమోషన్స్ ఏమాత్రం తగ్గలేదు. నాలుగు గంటల నిడివి ఉన్నప్పటికీ, ప్రేక్షకులను ఒక్క క్షణం కూడా పక్కకు తిప్పుకోనివ్వకుండా ఆదిత్య ధర్ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించాడు. ఇలాంటి సాహసోపేతమైన చిత్రాన్ని తెరకెక్కించడానికి ఎంతో గట్స్ ఉండాలని, సాంకేతికంగాను, సంగీత పరంగాను సినిమా టాప్ క్లాస్‌లో ఉంది.

ముఖ్యంగా, జస్కిరాత్ సింగ్, హమ్జా అలీ మజారీ అనే రెండు భిన్నమైన పాత్రల్లో రణ్‌వీర్ పరకాయ ప్రవేశం చేశారు. క్లైమాక్స్ వరకు ఆయన నటన హృదయాన్ని మెలిపెట్టేలా ఉంది. షెడ్డులో బంధించిన సోదరిని కలిసే సన్నివేశంలో రణ్‌వీర్ ప్రదర్శించిన హావభావాలు ‘మాస్టర్ క్లాస్’. మాధవన్ నటన దేశ నిస్సహాయతను ప్రతిబింబించేలా ఉంది. ఈ విజయం చిత్ర బృందానికే కాకుండా భారతీయ సినిమాకు గర్వకారణమని ఆయన అభినందించారు. దీంతో, రాజమౌళి చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.