Varanasi : వార‌ణాసి షూటింగ్‌.. కీల‌క విష‌యాల‌ను వెల్ల‌డించిన రాజ‌మౌళి

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు న‌టిస్తున్న వార‌ణాసి (Varanasi) చిత్రానికి సంబంధించిన షూటింగ్ అప్‌డేట్‌ను ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి పంచుకున్నాడు.

Director RajaMouli says Varanasi movie shoot completed around 80 percent

Varanasi : సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు న‌టిస్తున్న తాజా చిత్రం వార‌ణాసి. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ప్రియాంక చోప్రా క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా పృథ్వీరాజ్ సుకుమార్ విల‌న్‌గా చేస్తున్నారు. టైమ్ ట్రావెల్ క‌థాంశంతో తెర‌కెక్కుతున్న ఈ మూవీపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. తాజాగా ఈ చిత్ర ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఓ అంత‌ర్జాతీయ ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్నారు.

వార‌ణాసి సినిమా షూటింగ్ ఇప్ప‌టికే 80 శాతం పూర్తైంద‌న్నారు. కీల‌క స‌న్నివేశాలు, యాక్ష‌న్ సీక్వెన్స్ అన్ని పూర్తి అయ్యాయ‌ని అన్నారు. మ‌రో 20 శాతం షూటింగ్ అంటే చిన్న చిన్న స‌న్నివేశాలే పెండింగ్‌లో ఉన్నాయ‌ని చెప్పుకొచ్చారు. నిజం చెప్పాలంటే 2022 నుంచి వార‌ణాసి క‌థ‌ను డెవ‌ల‌ప్ చేయ‌డం మొద‌లుపెట్టిన‌ట్లుగా చెప్పుకొచ్చారు.

Priyanka Jain : భారీ హారంతో బిగ్‌బాస్ బ్యూటీ.. ప్రియాంక జైన్ ముస్తాబు చూశారా?

ఈ చిత్రం గురించిన అన్ని విష‌యాల‌ను ఇప్పుడే చెప్ప‌లేన‌ని అన్నాడు. త‌న‌కు ఇండియానా జోన్స్ సినిమాలు అంటే చాలా ఇష్టం అని తెలిపారు. ఆ సినిమాలు చాలా స‌ర‌దాగా అనిపిస్తాయ‌ని తెలిపారు. ఇక.. క‌థ, దాని నేప‌థ్యం తెలియ‌కుండా సినిమాల‌ను ప్రేక్ష‌కులు ఆస్వాదించ‌లేర‌నే త‌న అభిప్రాయం అని చెప్పుకొచ్చారు. అందుక‌నే వార‌ణాసికి సంబంధించి వీడియోను ప్ర‌త్యేకంగా ఉండేలా గ్లింప్స్‌లా విడుద‌ల చేసిన‌ట్లు తెలిపారు.

ఈ చిత్ర క‌థ వార‌ణాసిలో మొద‌లై అంటార్కిటికా, ఆఫ్రికాల్లో ప్ర‌యాణించి రామాయ‌ణ కాలానికి తీసుకువెలుతుంద‌న్నారు. ఆ ఆరువాత మ‌ళ్లీ వార‌ణాసికి తీసుకొస్తుంద‌న్నారు. ఈ క‌థ‌లో ఉన్న భారీద‌న‌మే ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో తీయ‌డానికి కార‌ణం అని తెలిపాడు. ప్ర‌ముఖ హాలీవుడ్ ద‌ర్శ‌కుడు క్రిస్ట‌ఫ‌ర్ నోల‌న్ అంటే త‌న‌కు చాలా ఇష్టం అన్నాడు. త‌న‌ను ఎప్పుడూ నేరుగా క‌ల‌వ‌లేద‌ని చెప్పాడు. చిన్న‌ప్ప‌టి నుంచి హాలీవుడ్ సినిమాలు అంటే త‌న‌కు ఆస‌క్తి అని, వాటిని చూస్తూ పెరిగాన‌ని అన్నాడు. అందుక‌నే ఆ ప్ర‌భావం త‌న సినిమాల‌పై ఉంటుంద‌న్నాడు.

AGADHA : ఆక‌ట్టుకుంటున్న అగ‌ధ ట్రైల‌ర్‌.. మంత్ర తంత్ర విద్య‌ల‌కు అంద‌ని శ‌క్తి

వార‌ణాసి చిత్రానికి ఎంఎం కీర‌వాణి సంగీతాన్ని అందిస్తున్నారు. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.