Director Shankar planning Velpari movie with Rs.1000 crore budget.
Shankar: భారీ చిత్రాలకు కేరాఫ్ అంటే తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ అనే చెప్పేవారు. చెప్పడం కాదు.. భారతీయుడు, ఒకే ఒక్కడు, అపరిచితుడు, రోబో లాంటి సినిమాలు చూస్తే క్లియర్ గా అర్థం అవుతుంది కూడా. కానీ, ఏమయ్యిందో తెలియదు ఈమధ్య శంకర్ టైం అస్సలు బాలేదు. రోబో తరువాత ఆయన చేసిన సినిమాలన్నీ డిజాస్టర్స్ అవుతున్నాయి. ఐ, 2.o, ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ ఇలా ప్రతీ ఒక్క సినిమా ఒకదానికి మించి మరోకటి అన్నట్టుగా ప్లాప్ అవుతూ వస్తున్నాయి.
దీంతో, దర్శకుడు శంకర్ క్రేజ్ మొత్తం తగ్గిపోయింది. ఎంతలా, అంటే ఆయన ఇండియన్ 3మూవీకి నిర్మాతలు దొరకలేనంతగా. అందుకే, తన స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం చాలా కష్టపడుతున్నాడు శంకర్. అందుకే, తన డ్రీం ప్రాజెక్టును తెరకెక్కించడానికి ఫిక్స్ అయ్యాడు. అదే ‘వేల్పరి’ సినిమా. తమిళనాట చాలా ప్రసిద్ధి పొందిన నవల. పీరియాడికల్ కంటెంట్ తో ఉండే ఈ కథను చాలా కాలంగా తెరకెక్కించాలని చూస్తున్నాడు శంకర్(Shankar).
Thanuja Puttaswamy: బిగ్ బాస్ బ్యూటీ తనూజ.. చీరలో ఎంత క్యూట్ గా ఉందో.. ఫొటోలు
ఆ సమయం ఇప్పుడు ఆసన్నం అయినట్టుగా తెలుస్తోంది. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించనున్నాడట శంకర్. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు స్టార్స్ కి స్కోప్ ఉందట. అందుకోసం బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్, చియాన్ విక్రమ్ లను సెలెక్ట్ చేసుకున్నాడట. ఈ ఇద్దరితో ఇప్పటికే చర్చలు కూడా జరిగాయని సమాచారం.
ఇక ఈ ప్రాజెక్టు కోసం ఈ ఇద్దరినీ తీసుకోవడానికి రీజన్ ఉందట. అదేంటంటే, శంకర్ విక్రమ్ గతంలో అపరిచితుడు, ఐ లాంటి సినిమాలు చేశారు. వీరిది హిట్ కాంబినేషన్. అలాగే, గేమ్ ఛేంజర్ తరువాత శంకర్ హీరో రణ్వీర్ సింగ్ తో సినిమా చేయాల్సి ఉంది. అందుకే, ఈ ఇద్దరినీ హీరోలుగా ఫిక్స్ చేశాడట శంకర్. ఇక రణ్వీర్ సింగ్ కూడా ధురంధర్ సినిమాతో ఫుల్ ఫేమ్ సంపాదించాడు. కాబట్టి, ఆ ఫేమ్ తన సినిమాకు కూడా వర్క్ అవుతుందని భావిస్తున్నాడట శంకర్. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట ఈ ప్రాజెక్టుపై. మరి వరుస ప్లాప్స్ తరువాత తన డ్రీం ప్రాజెక్టుతో వస్తున్న శంకర్ ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుంటాడు అనేది చూడాలి.