Allu arjun : బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్.. సుకుమార్ ఆనందం చూశారా..!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది గొప్ప నటులు ఉన్నారు. ప్రేక్షకుల హృదయాల్లో చెదరని ముద్ర వేసిన వారు ఎందరో. అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా జాతీయ అవార్డుల్లో ఒక్కసారి కూడా ఉత్తమ నటుడి అవార్డును ఓ తెలుగు నటుడు గెలుచుకోలేకపోయాడు
- Thota Vamshi Kumar
- Updated on- August 24, 2023 / 07:43 PM IST
Sukumar hugs Allu Arjun
Sukumar hugs Allu Arjun : తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది గొప్ప నటులు ఉన్నారు. ప్రేక్షకుల హృదయాల్లో చెదరని ముద్ర వేసిన వారు ఎందరో. అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా జాతీయ అవార్డుల్లో ఒక్కసారి కూడా ఉత్తమ నటుడి అవార్డును ఓ తెలుగు నటుడు గెలుచుకోలేకపోయాడు. ఇంత కాలం ఇది తీరని లోటుగా ఉండేది. ఇక ఇది అందని ద్రాక్షగానే మిగులుతుందా అన్న సందేహం కలుగుతున్న వేళ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. పుష్ప చిత్రంలోని పుష్పరాజ్ పాత్రలో బన్నీ నటనకు ఈ అవార్డు వచ్చింది. బన్నీ అభిమానులతో పాటు యావత్తు తెలుగు సినీ ప్రియులు సంబరాలు చేసుకుంటున్నారు.
National Film Awards 2023 : మెగా హీరోలు నటించిన చిత్రాల పంట పండింది..!
ఇక పుష్ప చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సుకుమార్ ఫీలింగ్ ఎలా ఉంటుందా అన్న సందేహం కలగకమానదు. బన్నీని ఉత్తమ నటుడిగా అనౌన్స్ చేయగా దర్శకుడు సుకుమార్ వెంటనే అల్లుఅర్జున్ వద్దకు వెళ్లి గట్టిగా హత్తుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను మైత్రీ మూవీ మేకర్స్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పుష్ప చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా సుకుమార్ ఆనందాన్ని చూసేయండి.
National Film Awards 2023 : బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్‌కి నేషనల్ అవార్డు.. పుష్ప తగ్గేదేలే..
