Director Sukumar: కార్తికేయ నిర్మాతలతో సుకుమార్ తదుపరి సినిమా.. హీరో అతడేనా?

సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి, అభిషేక్ అగర్వాల్‌ మారోమారు చేతులు కలపబోతున్నారు. వీరిద్దరూ కలిసి నిర్మించిన "ది కాశ్మీర్ ఫైల్స్‌" సినిమా దేశవ్యాప్తంగా ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరు నిర్మాతలు టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో ఒక సినిమాని తెరకెక్కించబోతున్నారు.

  • Published On : November 4, 2022 / 01:22 PM IST

Director Sukumar's next film with Karthikeya producers

Director Sukumar: సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి, అభిషేక్ అగర్వాల్‌ మారోమారు చేతులు కలపబోతున్నారు. వీరిద్దరూ కలిసి నిర్మించిన “ది కాశ్మీర్ ఫైల్స్‌” సినిమా దేశవ్యాప్తంగా ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరు నిర్మాతలు టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో ఒక సినిమాని తెరకెక్కించబోతున్నారు.

Pushpa 2: ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్.. రియల్ టైగర్‌తో పుష్పరాజ్ ఫైట్..?

‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘కార్తికేయ-2’ సినిమాలతో వరుస విజయాలు అందుకున్న అభిషేక్ అగర్వాల్‌ టాలీవుడ్ లెక్కల మాస్టర్ తో కలిసి ఒక భారీ బుడ్జెక్ట్ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు వివేక్ రంజన్ అగ్నిహోత్రి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ విషయాన్ని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ సోషల్ మీడియా వేదిక ద్వారా తెలియజేశాడు.

అయితే ఈ సినిమాలో హీరోగా ఎవరు నటించబోతున్నారు అనే విషయాన్ని మటుకు తెలియజేయలేదు. కాగా ఇటీవల సుకుమార్, రామ్ చరణ్ పై ఆల్రెడీ ఇంట్రో సీన్ తెరకెక్కించనుట్లు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాలో రామ్ చరణ్ హీరోగా నటించబోతున్నాడని జోష్యం చెబుతున్నారు నెటిజెన్లు. ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2 సినిమాని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు.