Custody: కస్టడీ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన వెంకట్ ప్రభు.. మరి హీరో..?

తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన ‘కస్టడీ’ మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తుండగా, ఈ మూవీ సీక్వెల్ పై వెంకట్ ప్రభు క్లారిటీ ఇచ్చారు.

Director Venkat Prabhu Confirms Of Custody Sequel

Custody: అక్కినేని నాగచైతన్య లేటెస్ట్ మూవీ ‘కస్టడీ’ షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను తమిళ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ సినిమాను మే 12న ప్రపంచవ్యాప్తంగా మంచి అంచనాల మధ్య రిలీజ్‌కు రెడీ చేశారు. కాగా, ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు.

Custody Movie: కస్టడీ మూవీకి కూడా ఆ అంశం కలిసొచ్చేనా..?

ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో చిత్ర దర్శకుడు వెంకట్ ప్రభు పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. గతంలో దిల్ రాజు ‘వారిసు’ మూవీ ఈవెంట్‌లో చెప్పిన పాలపులర్ డైలాగ్‌ను ఇమిటేట్ చేస్తూ వెంకట్ ప్రభు సందడి చేశారు. ఇక నాగచైతన్యతో వర్క్ చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందని.. కస్టడీ మూవీ జనాలందరికీ నచ్చే విధంగా ఉండబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాను ప్రస్తుతం పూర్తిగా పర్ఫెక్ట్ తెలుగులో మాట్లాడలేకపోతున్నానని.. కస్టడీ సీక్వెల్ ఈవెంట్‌లో తాను ఖచ్చితంగా పూర్తిగా తెలుగులోనే మాట్లాడే ప్రయత్నం చేస్తానంటూ వెంకట్ ప్రభు తెలిపారు.

Custody Movie: కస్టడీ నుండి ‘టైమ్‌లెస్ లవ్’ అంటూ వింటేజ్ సాంగ్ పట్టుకొస్తున్న చైతూ

దీంతో, కస్టడీ మూవీకి సీక్వెల్ కూడా ఉండబోతుందా అని అందరూ అనుకుంటున్నారు. అయితే, ప్రస్తుతం కస్టడీ సీక్వెల్ మూవీకి సంబంధించిన స్క్రీప్ట్ పనుల్లో వెంకట్ ప్రభు ఉన్నట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. మరి సీక్వెల్ తెరకెక్కించేందుకు డైరెక్టర్ రెడీ అయ్యారుగానీ.. హీరో మాటేమిటని పలువురు కామెంట్ చేస్తున్నారు. కస్టడీ మూవీ సీక్వెల్ ఉంటే, అందులో హీరోగా ఎవరు నటిస్తారా అనే టాక్ ప్రస్తుతం నెట్టింట జోరుగా వినిపిస్తోంది.