CM Vijay Number Plate: సీఎం విజయ్‌కి కారు నెంబర్ ప్లేట్ గిఫ్ట్ ఇచ్చిన డైరెక్టర్.. అప్పుడు అనుకున్నారు ఇప్పుడు అయింది..
విజయ్ సీఎం అయ్యాక ఆ కార్ నెంబర్ ప్లేట్ ని చక్కగా ఫ్రేమ్ చేయించి తీసుకెళ్లి విజయ్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు. (CM Vijay)
Director Venkat Prabhu Gifted A Car Number Plate To Cm Vijay
CM Vijay : తమిళనాడులో స్టార్ హీరో విజయ్ సీఎం అయిన సంగతి తెలిసిందే. తాజాగా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు సీఎం విజయ్ ని కలిసి ఓ కార్ నెంబర్ ప్లేట్ ని గిఫ్ట్ గా ఇచ్చారు. అదేంటి కార్ నెంబర్ ప్లేట్ గిఫ్ట్ గా ఇవ్వడం ఏంటి? దాంట్లో స్పెషల్ ఏముందా అని అనుకుంటున్నారా?
వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ GOAT అనే సినిమా చేసారు. 2024 లో వచ్చిన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. అప్పటికే విజయ్ పార్టీ ప్రకటించడంతో ఆ సినిమాలో విజయ్ వాడే కారుకి TN 07 CM 2026 అనే నెంబర్ ఉన్న ప్లేట్ ని అమర్చారు. వెంకట్ ప్రభు విజయ్ 2026 లో సీఎం అవుతారు అని ఊహించి అప్పట్లోనే కారు కి ఆ నెంబర్ ప్లేట్ పెట్టినట్టు గతంలోనే తెలిపాడు.
Also Read : NTR : విజయ్ సీఎం అవ్వడం పెద్ద విశేషం కాదు.. ఎన్టీఆర్ సీఎం అవుతారు.. దువ్వాడ జంట కామెంట్స్ వైరల్..
ఇప్పుడు విజయ్ సీఎం అయ్యాక ఆ కార్ నెంబర్ ప్లేట్ ని చక్కగా ఫ్రేమ్ చేయించి తీసుకెళ్లి విజయ్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు. సీఎం విజయ్ తో దిగిన ఫోటోలను వెంకట్ ప్రభు తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. చరిత్ర సృష్టించారు. ఒక ఆలోచన నుంచి ఈ సమయం వరకు. ఇవాళ సీఎం విజయ్ గారిని కలవడం, GOAT సినిమా మొదటి అనుకున్న దానిని ఆయనకు ఇవ్వడం ఆనందంగా ఉంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని పోస్ట్ చేసారు.
View this post on Instagram
దీంతో విజయ్ వెంకట్ ప్రభు కార్ నెంబర్ ప్లేట్ తో దిగిన ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. విజయ్ సీఎం అవుతాడని వెంకట్ ప్రభు ఊహించి ఇలా కార్ నెంబర్ పెట్టారని GOAT సినిమా గురించి అప్పట్లోనే చర్చ జరిగింది.
Also See : Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ బర్త్ డే స్పెషల్.. ఫ్యామిలీ ఫొటోలు చూశారా..?

