NTR : విజయ్ సీఎం అవ్వడం పెద్ద విశేషం కాదు.. ఎన్టీఆర్ సీఎం అవుతారు.. దువ్వాడ జంట కామెంట్స్ వైరల్..
దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట మాట్లాడుతూ విజయ్, ఎన్టీఆర్, పాలిటిక్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
NTR
NTR : ఇటీవల వైరల్ గా మారిన దువ్వాడ శ్రీనివాస్ – దివ్వెల మాధురి జంట తాజాగా ఓ సినిమా ఈవెంట్ కి హాజరయ్యారు. ఈ ఈవెంట్లో 10 టీవీతో మాట్లాడుతూ విజయ్, ఎన్టీఆర్, పాలిటిక్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
దివ్వెల మాధురి మాట్లాడుతూ.. ఆయనకు సీనియర్ ఎన్టీఆర్ అంటే పిచ్చి. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. ఆయన సినిమా అంటే మొదటి రోజే చూడాల్సిందే. ఆయన బర్త్ డే రోజు బ్లడ్ డొనేషన్ కూడా చేస్తున్నాం. జూనియర్ ఎన్టీఆర్ గారు పార్టీ పెడితే ఆయన పార్టీలోకి చేరిపోతాం నేను, ఆయన(దువ్వాడ శ్రీనివాస్). జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టాలి. ఆ ఛరిష్మా, సామర్థ్యం ఆయనకు ఉంది. ఎన్టీఆర్ గారు పాలిటిక్స్ లోకి రావాలి. ఆయన పార్టీ పెడితే కచ్చితంగా సీఎం అవుతారు. ఎన్టీఆర్ సీఎం అయితే సోషల్ సర్వీస్ బాగా చేస్తారు అని అన్నారు.
Also See : Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ బర్త్ డే స్పెషల్.. ఫ్యామిలీ ఫొటోలు చూశారా..?
దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ.. నాకు సీనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. ఆయన ఆహార్యం, ఆయన పద్ధతి జ్నియార్ ఎన్టీఆర్ లో కనిపిస్తాయి. జూనియర్ ఎన్టీఆర్ కూడా అంతటి నటుడు కాబట్టి నాకు ఆయన ఇష్టం. జూనియర్ ఎన్టీఆర్ ఏం చేసినా బాగానే ఉంటుంది. పార్టీ పెట్టగల సమర్థత ఆయనకు ఉంది. చాలా మాట్లాడగలరు, పబ్లిక్ లో ఆయనకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది.
విజయ్ గారు ఓ 12 ఏళ్లుగా కార్యక్రమాలు చేస్తూ వచ్చి పార్టీ పెట్టి ఇప్పుడు గెలిచారు. ఆయన అభిమానులను తెలివిగా పొలిటికల్ గా టర్న్ చేసాడు. విజయ్ సీఎం అవ్వడం పెద్ద విశేషం కాదు. ఎందుకంటే అక్కడ తమిళనాడులో MGR దగ్గర్నుంచి ఇప్పటివరకు ఆల్మోస్ట్ అందరూ సినీ నటులే పరిపాలించారు. ఇప్పుడు కూడా సినీ నటుడే. తెలుగుదేశం సంక్షోభంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ ప్రచారం చేసారు. పార్టీని భుజాన వేసుకున్నాడు. ఆయనకు అవన్నీ అలవాటే అని అన్నారు.
