Ram Pothineni: పాపం రామ్ కె ఎందుకు ఇలా జరుగుతుంది.. నెక్స్ట్ ప్రాజెక్టు నుంచి డైరెక్టర్ అవుట్

రామ్ పోతినేని(Ram Pothineni) నెక్స్ట్ సినిమా నుంచి తప్పుకున్న దర్శకుడు విగ్నేష్.

Director Vignesh Exits Ram Pothineni Next Film

  • రామ్ కొత్త సినిమా నుంచి తప్పుకున్న డైరెక్టర్
  • కొత్త డైరెక్టర్ కోసం టీం వెతుకులాట
  • మే 15న రామ్ కొత్త సినిమాపై ప్రకటన వచ్చే అవకాశం

Ram Pothineni: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన విభిన్నమైన నటన, డ్యాన్స్‌తో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, ఆయన నటించిన గత చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఆడియన్స్ ను నిరాశపరించింది అనే చెప్పాలి. ఆ తరువాత రామ్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించడంలో కాస్త జాప్యం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తదుపరి చిత్ర దర్శకుడి విషయంలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

Chandrababu-Ntr: ‘మావయ్య’ అంటూ ఆత్మీయంగా.. చంద్రబాబుకు బర్త్ డే విషెస్ తెలిపిన ఎన్టీఆర్

అదేంటంటే, తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ శిష్యుడు విగ్నేష్‌తో రామ్ తన నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు అంటూ గత కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కూడా దాదాపు ఖరారైందని వార్తలు వినిపించాయి. కానీ, తాజాగా ఆ దర్శకుడు ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఫైనల్ అవుతుంది అనుకున్న తరుణంలో ఇలా దర్శకుడు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో ఆయన ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు.

కానీ, ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు మే 15న రామ్ పోతినేని(Ram Pothineni) పుట్టినరోజు సందర్భంగా ఈ కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్. ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించి కథను కూడా స్వయంగా రామ్ రాసుకోవడం విశేషం. ఈ కథకు ది లోనే వూల్ఫ్ అనే డిఫరెంట్ టైటిల్ ను కూడా అనుకుంటున్నారట. మరి ఈ సినిమాతో అయినా రామ్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడా అనేది చూడాలి.