Vignesh Shivan: నా కలలు ముక్కలయ్యాయి.. నయనతార భర్త విగ్నేష్ శివన్ ఆవేదన

సోషల్ మీడియా వల్లనే Lik మూవీ ప్లాప్ అయ్యింది అంటున్న విగ్నేష్ శివన్(Vignesh Shivan).

Director Vignesh Shivan Emotional comments on Lik movie flop

  • నెగెటివ్ రివ్యూలతో నా కలలు ముక్కలు
  • ‘LIK’ పరాజయాన్ని జీర్ణించుకోలేకపోతున్న విఘ్నేశ్
  • సినిమా నిర్మించడం ఎంతో పెద్ద పోరాటం

Vignesh Shivan; సినిమాలపై కొందరు ఉద్దేశపూర్వకంగా చేసే నెగెటివ్ ప్రచారం, ట్రోలింగ్ దర్శకుల కలలను ఎలా ముక్కలు చేస్తాయో వివరిస్తూ ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్ శివన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన దర్శకత్వంలో భారీ అంచనాలతో విడుదలైన ‘ఎల్‌ఐకే’ (LIK) చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆన్‌లైన్‌లో విపరీతంగా కనిపించిన నెగెటివ్ రివ్యూల వల్లే చాలా మంది ప్రేక్షకులు థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యామని తనకు మెసేజ్‌లు చేస్తున్నారని తెలిపారు.

Peddi pre release event: ఈరోజే ‘పెద్ది’ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్టుగా ఎవరెవరు వస్తున్నారో తెలుసా?

చిత్ర పరిశ్రమలో పెద్దల మద్దతు లేని చిన్న సినిమాల తలరాతలను ఇలాంటి ఉద్దేశపూర్వక విమర్శలే మార్చేస్తాయని, ఇవి ప్రేక్షకులను గందరగోళానికి గురిచేస్తాయని ఆయన పేర్కొన్నారు. మంచి టాక్‌తో ఓపెనింగ్స్ సాధించిన తర్వాత, ఒక్కసారిగా పరిస్థితి మారిపోవడాన్ని తాను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానని, దీని నుంచి బయటకు రాలేకపోతున్నానని బాధపడ్డారు. ఒక సినిమాను నిర్మించి, అన్ని సవాళ్లను అధిగమించి థియేటర్ల వరకు తీసుకురావడం వెనుక ఎంతో పోరాటం ఉంటుందని, కానీ చివరికి దానికి ఇలాంటి ముగింపు రావడం ఎంతో కలచివేస్తోందని విఘ్నేశ్ శివన్(Vignesh Shivan) ఆవేదన చెందారు.

ఎంతో కష్టపడి రూపొందించిన తన సినిమాకు దక్కాల్సిన ఆదరణ ఇంకా దక్కలేదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, సినిమా చరిత్రలో మొదట్లో పరాజయం పాలై, ఆ తర్వాత కాలంలో క్లాసిక్ చిత్రాలుగా నిలిచిన సినిమాలు ఎన్నో ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. భవిష్యత్తులో తన ‘ఎల్‌ఐకే’ చిత్రానికి కూడా ఖచ్చితంగా అలాంటి గుర్తింపు, ఆదరణ లభిస్తాయనే ఆశతోనే తాను ముందుకు సాగుతున్నట్లు విఘ్నేశ్ శివన్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.