Lik Title Story: టైటిల్ కోసం రూ.112 కోట్లా.. విఘ్నేశ్ శివన్ ‘Lik’ టైటిల్ వెనుక అసలు కథ ఇదే
Lik (Lik Title Story)మూవీ టైటిల్ వెనుక ఉన్న అసలు కథ చెప్పిన దర్శకుడు విగ్నేష్ శివన్.
- V Santhosh Kumar
- Published on- April 15, 2026 / 07:46 PM IST
Director Vignesh Shivan reveals the true story behind Lik movie title.
- Lik సినిమా టైటిల్ వివాదం
- రూ.112 కోట్లు డిమాండ్ చేసిన సంస్థ
- ‘Lik’ టైటిల్ ఇంట్రెస్టింగ్ స్టోరీ
Lik Title Story: దర్శకుడు విఘ్నేశ్ శివన్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (Lik). ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా వచ్చిన ఈ సినిమా ఇటీవల విడువులై ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. అయితే, ఈ సినిమా టైటిల్ గురించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా టైటిల్ మార్పు వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈ సినిమాకు మొదట ‘LIC'(Lik Title Story) అనే పేరును అనుకున్నారు.
అయితే, ఈ పేరు వాడటంపై భారత ప్రభుత్వ భీమా సంస్థ (Life Insurance Corporation) అభ్యంతరం వ్యక్తం చేస్తూ లీగల్ నోటీసులు పంపింది. ఆ టైటిల్‌ను ఉపయోగించాలంటే ఏకంగా రూ. 112 కోట్లు డిమాండ్ చేయడంతో, విఘ్నేశ్ శివన్ టైటిల్ మార్పు నిర్ణయం తీసుకున్నారు. లీగల్ చిక్కుల నుంచి తప్పించుకోవడానికి ఆయన పలు ఆప్షన్లను పరిశీలించి, చివరకు ‘Company’ అనే పదాన్ని ‘Kompany’గా మారుస్తూ ‘LIK’ అనే పేరును ఖరారు చేశారు.
ఒక చిన్న అక్షరం మార్పుతో వందల కోట్ల భారాన్ని తప్పించుకుని సినిమాను విభిన్నంగా ప్రమోట్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద స్థిరమైన కలెక్షన్స్ సాధిస్తూ ముందుగు సాగుతోంది. విడుదలైన మొదటి నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.39 కోట్లను రాబట్టినట్లు సమాచారం. ప్రదీప్ రంగనాథన్ నటన, విఘ్నేశ్ శివన్ టేకింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. టైటిల్ వివాదం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కూడా సినిమాకు కలిసొచ్చింది.
