Raviteja- Vivek: క్రేజీ మూవీ నుంచి బాలయ్య అవుట్.. రవితేజతో సినిమా ఫిక్స్ చేసిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్

బాలకృషతో సినిమాను పక్కన పెట్టేసిన బ్లాక్ బస్టర్ దర్శకుడు వివేక్ ఆత్రేయ(Raviteja- Vivek).

Director Vivek Athreya making a film with Ravi Teja, not Balakrishna.

  • వరుస ఫ్లాపులతో పడిపోయిన మార్కెట్.
  • శివ నిర్వాణ ‘ఇరుముడి’పై ఆశలు.
  • వివేక్ ఆత్రేయతో మాస్ క్రేజీ ప్రాజెక్ట్.

Raviteja- Vivek: మాస్ మహారాజా రవితేజ వరుస పరాజయాల తర్వాత తన రూట్ మార్చుకుంటున్నారు. ‘ధమాకా’ వంటి భారీ హిట్ తరువాతబ్ ఆయన చేసిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయ్యాయి. దాంతో, ఆయన మార్కెట్ చాలా పడిపోయింది. అందుకే, ప్రస్తుతం రవి తేజకు వెంటనే హిట్ కావాలి. ఈ నేపథ్యంలో తన మార్కెట్ వాల్యూని తిరిగి పెంచుకోవడానికి, యూత్ ఆడియన్స్‌కు నచ్చే సరికొత్త కథలను ఎంచుకుంటూ ఆయన అడుగులు వేస్తున్నారు.

Aditi Rao Hydari: ఫెమినా అవార్డ్స్‌లో అదితి మెరుపులు.. ‘ఎటర్నల్ మ్యూజ్’గా సరికొత్త రికార్డు.. ఫోటోలు

ప్రస్తుతం రవితేజ(Raviteja- Vivek) తన ఇమేజ్‌కు భిన్నంగా శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఇరుముడి’ అనే చిత్రాన్ని చేస్తున్నారు. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పటికే ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్స్‌ను క్రియేట్ చేసింది. ఈ ఏడాది సెకండ్ హాఫ్ లోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వైవిధ్యమైన ప్రయత్నంతో ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలని రవితేజ గట్టి పట్టుదలతో ఉన్నారు.

మరోవైపు, ‘సరిపోదా శనివారం’ ఫేమ్ వివేక్ ఆత్రేయతో రవితేజ తన తదుపరి ప్రాజెక్టును ఖరారు చేశారు. నిజానికి ఈ కథను వివేక్ మొదట బాలకృష్ణ కోసం సిద్ధం చేశారు, కానీ బాలయ్య డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఈ అవకాశం రవితేజను వరించింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. టాలెంటెడ్ వివేక్ ఆత్రేయ మేకింగ్, రవితేజ ఎనర్జీ తోడైతే బాక్సాఫీస్ వద్ద మాస్ మహారాజా మళ్ళీ తన సత్తా చాటడం ఖాయంగా కనిపిస్తోంది.