Chiranjeevi : చిరంజీవి హాలీవుడ్ సినిమా ‘అబు’.. 40 కోట్లతో.. అప్పటి విషయాలు బయటపెట్టిన దర్శకులు..
కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు చిరంజీవితో అబు అనే హాలీవుడ్ సినిమాని ప్లాన్ చేసారు.(Chiranjeevi)
- Saketh U
- Updated on- August 19, 2026 / 08:31 AM IST
Chiranjeevi Hollywood Movie Abu
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రేంజ్ ఏంటో అందరికి తెలిసిందే. రాజకీయాల్లోకి రాకముందే మెగాస్టార్ పాన్ ఇండియా హీరో. ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోల్లో చిరు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు అప్పట్లో. ఎన్నో రికార్డులు చిరంజీవి పేరు మీదే ఉన్నాయి. టాలీవుడ్ ని దాదాపు మూడు దశాబ్దాలు ఏకచత్రాధిపత్యంగా ఏలారు మెగాస్టార్. అప్పట్లోనే హాలీవుడ్ లో కూడా చిరంజీవికి మంచి గుర్తింపు ఉంది.
అయితే కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు చిరంజీవితో అబు అనే హాలీవుడ్ సినిమాని ప్లాన్ చేసారు. భారీగా ఆ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టారు కానీ అనుకోని కారణాలతో ఆ సినిమా ఆగిపోయింది. తాజాగా తమిళ దర్శకులు పుష్కర్, గాయత్రిలు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాము ఆ సినిమాకు పనిచేశామంటూ అప్పటి సంగతులు తెలిపారు.
Also Read : Suriya : ‘రాకా’ తర్వాత ప్లాన్ చేయబోతున్న అట్లీ..? పాన్ ఇండియా రేస్ లోకి సూర్య..
పుష్కర్, గాయత్రి మాట్లాడుతూ.. చిరంజీవి అబు – థీఫ్ ఆఫ్ బాగ్దాద్ సినిమా 1999 లోనే భారీగా ప్లాన్ చేసారు. అప్పట్లోనే దాదాపు 40 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ సినిమాగా ప్లాన్ చేసారు. ఆ సినిమా షూటింగ్ కూడా హాలీవుడ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, ఇండియాలలో ప్లాన్ చేసారు. వేరే దేశాల నటీనటులను కూడా అనుకున్నారు. ఇండియన్ డైరెక్టర్ తో పాటు ఒక అమెరికన్ డైరెక్టర్ కూడా ఆ సినిమాకు పనిచేయాలి. అప్పుడు ఆ సినిమాకు పుష్కర్ కెమెరా డిపార్ట్మెంట్ లో, గాయత్రి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసాము. కానీ ఆ సినిమా ఆగిపోయింది. ఆ సినిమాను ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే భారీగా ప్లాన్ చేసారు అని తెలిపారు.
దీంతో అబు సినిమా వచ్చి ఉంటే మెగాస్టార్ కి హాలీవుడ్ లో మరింత గుర్తింపు వచ్చేది. అప్పట్లోనే పాన్ వరల్డ్ సినిమాలు రిలీజ్ చేసే వాళ్ళు అని మెగా ఫాన్స్ భావిస్తున్నారు.
