Anchor Sravanthi : అర్ధరాత్రి 12 గంటలకు యాంకర్ స్రవంతికి ఫోన్ చేసిన హీరో.. ఇన్‌స్టాగ్రామ్ లో నెంబర్ అడిగి మరీ..
తనకు అర్ధరాత్రి 12 గంటలు ఓ హీరో కాల్ చేసి తన వర్క్ గురించి పొగిడాడు అని చెప్పుకొచ్చింది యాంకర్ స్రవంతి. (Anchor Sravanthi)
- Saketh U
- Published On : February 19, 2026 / 09:16 AM IST
Anchor Sravanthi
Anchor Sravanthi : యాంకర్ గా ఫుల్ ఫేమ్ సంపాదించుకున్న స్రవంతి ఇప్పుడు నటిగా మారి సినిమాలు చేస్తుంది. తను కీలక పాత్రలో నటించిన హే బల్‌వంత్ సినిమా ఫిబ్రవరి 20న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా స్రవంతి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు తెలిపింది.(Anchor Sravanthi)
ఈ క్రమంలో తనకు అర్ధరాత్రి 12 గంటలు ఓ హీరో కాల్ చేసి తన వర్క్ గురించి పొగిడాడు అని చెప్పుకొచ్చింది.
యాంకర్ స్రవంతి మాట్లాడుతూ.. రీసెంట్ గా ఒక సినిమా ఈవెంట్ చేశాను. ఈవెంట్ లేట్ గా అయింది. ఈవెంట్ అయ్యాక రాత్రి 12 గంటలకు ఆ సినిమా హీరో నాకు ఇన్‌స్టాగ్రామ్ లో.. ఫ్రీ ఉన్నప్పుడు కాల్ చేయండి అని మెసేజ్ పెట్టారు. ఆయన గురించి నేను ఏం తప్పు మాట్లాడలేదు కదా అని కంగారు పడ్డాను. ఈవెంట్ బాగానే చేశాను కదా అని అనుకున్నా. సరే అని నా నంబర్ పెట్టి రేపు కాల్ చేస్తాను అని చెప్పాను. కానీ నెంబర్ పెట్టగానే ఆయన వెంటనే కాల్ చేసారు.
నేను లిఫ్ట్ చేస్తే మీరు ఈవెంట్ చాలా బాగా హ్యండిల్ చేసారు. నేను ఎప్పుడూ గమనించను. నేను మొదట్లో చూసిన స్రవంతికి ఇప్పుడు చూసే స్రవంతి చాలా మారింది. చాలా గర్వంగా ఉంది మిమ్మల్ని, మీ వర్క్ ని చూస్తే అన్నారు. రాయలసీమ నుంచి అక్కడనుంచి వచ్చిన అమ్మాయిలు ఇలా సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ అని అన్నారు. అలా ఆయన చెప్పేసరికి చాలా హ్యాపీ అనిపించింది. మనం బాగున్నాం అనేదానికంటే మన వర్క్ బాగుందని పొగడటంతో ఫుల్ హ్యాపీ అనిపించింది, సంతృప్తిగా అనిపించింది. నేను హీరో పేరు మాత్రం చెప్పను అని తెలిపింది.
Also See : Sravanthi Chokarapu : బ్లాక్ డ్రెస్ లో బ్యాక్ లెస్ ఫోజులతో.. వైరల్ అవుతున్న యాంకర్ స్రవంతి..
అర్ధరాత్రి 12 గంటలకు కాల్ చేసి మరీ యాంకర్ వర్క్ ని అభినందించిన హీరో ఎవరా అని చర్చించుకుంటున్నారు నెటిజన్లు.
