Allu Sirish
Allu Sirish : అల్లు శిరీష్ ఇటీవలే తను ప్రేమించిన అమ్మాయి నయనికని నిశ్చితార్థం చేసుకున్నాడు. త్వరలో మార్చ్ 6న వీరి పెళ్లి జరగనుంది. గత కొంతకాలంగా ప్రేమించుకొని డేటింగ్ లో ఉన్న ఈ జంట ఇప్పుడు పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. అయితే నయనిక కంటే ముందు అల్లు శిరీష్ కి ఒక బ్రేకప్ లవ్ స్టోరీ ఉంది.(Allu Sirish)
గతంలో అల్లు శిరీష్ స్వయంగా ప్రదీప్ యాంకరింగ్ చేసిన కొంచెం టచ్ లో ఉంటే చెప్తా షోలో తన లవ్ స్టోరీ గురించి తెలిపాడు. అయితే ఇది అల్లు శిరీష్ చదువుకునే రోజుల్లో జరిగిన ప్రేమకథ.
ఆ ఇంటర్వ్యూలో అల్లు శిరీష్ అప్పటి తన లవ్ స్టోరీ గురించి చెప్తూ.. నేను బాంబేలో చదువుకునేటప్పుడు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది. ఆ అమ్మాయి మోడల్. ఆమె వీకెండ్ ఎప్పుడూ పబ్బుకి, పార్టీలకు తీసుకెళ్లేది. అక్కడికి వెళ్తే నాలుగైదువేలు అయిపోయేవి. ఆమె ముందు లెవల్ తగ్గించుకునేవాడ్ని కాదు. డబ్బులు కావాలి.
దాంతో ఇంటికి ఫ్లైట్ లో వస్తాను అని చెప్పి 8000 తీసుకొని బస్సు లో అప్ అండ్ డౌన్ 1500లో వచ్చి వెళ్లేవాడిని. మిగతా డబ్బులని గర్ల్ ఫ్రెండ్ ని మెయింటైన్ చేయడానికి ఖర్చుపెట్టేవాడ్ని. దెబ్బకు ఆరు నెలలకే ఆమెని మెయింటైన్ చేయలేక బ్రేకప్ అయింది అని తెలిపారు.
Also See : Dushyanth : ఎంపీ కూతుర్ని నిశ్చితార్థం చేసుకున్న హీరో.. ఫోటోలు వైరల్.. విజయ్ రష్మిక పెళ్లి రోజే..
అలా అల్లు శిరీష్ కి చదువుకునే రోజుల్లోనే డబ్బులు ఎక్కువ ఖర్చుపెట్టించే అమ్మాయిని ప్రేమించి బ్రేకప్ అయింది. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ప్రేమలో పడి నయనికని పెళ్లి చేసుకోబోతున్నాడు శిరీష్.