×
Ad

Chandrahass : డిగ్రీ సర్టిఫికెట్ కొందాం అని ప్లాన్ చేసిన యాటిట్యూడ్ స్టార్.. కానీ ఒక్క సెమిస్టర్ లో.. ఇదేదో సినిమా కథలా ఉందే..

తాజాగా చంద్రహాస్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా అనేక ఆసక్తికర విషయాలు తెలిపాడు. (Chandrahass)

  • Published On : February 21, 2026 / 12:41 PM IST

Chandrahass

Chandrahass : సీనియర్ సీరియల్ నటుడు ప్రభాకర్ కొడుకుగా ఆసిని పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన చంద్రహాస్ తన యాటిట్యూడ్ తో యాటిట్యూడ్ స్టార్ అని పేరు తెచ్చుకున్నాడు. సినిమా రిజల్ట్స్ ఎలా ఉన్న వరుస సినిమాలు చేస్తున్నాడు చంద్రహాస్.

తాజాగా చంద్రహాస్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా అనేక ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఈ క్రమంలో తన చదువు గురించి మాట్లాడాడు.

Also Read : KH x RK Reunion : రజినీకాంత్ – కమల్ హాసన్ కలిసి సినిమా.. ప్రోమో వచ్చేసింది.. ఎవరు హీరో..

చంద్రహాస్ మాట్లాడుతూ.. నేను చిన్నప్పట్నుంచి ఒక నాలుగైదు స్కూల్స్ మారాను. చిన్నప్పటి నుంచి ఎగ్జామ్స్ ఫెయిల్ అవ్వలేదు. కాలేజీకి వచ్చాక బ్యాక్ ల్యాగ్స్ రాసుకోవచ్చు అని తెలిసి ఫెయిల్ అయ్యాను. ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ సినిమాలో 22 బ్యాక్ ల్యాగ్స్ అన్ని ఒక్కసారి క్లియర్ చేస్తాడు. నేను ఒకేసారి 26 బ్యాక్ ల్యాగ్స్ క్లియర్ చేశా. లాస్ట్ సెమిస్టర్ లో అన్ని ఒకేసారి క్లియర్ చేశా. ఏం చదవకుండానే ముందు మిగిలిన సబ్జెక్ట్స్ క్లియర్ అయ్యాయి. లాస్ట్ సెమిస్టర్ తర్వాత మన ఫ్రెండ్స్ ఎవరు తోడు ఉండరు ఆ కాలేజీలో అని వన్ డే బ్యాటింగ్స్ చేసి చదివి రాసా. నా ఫ్రెండ్ రియా అనే ఓ అమ్మాయి మా ఇంట్లో వారం రోజులు ఉండి నన్ను ఎగ్జామ్ కి ప్రిపేర్ చేసింది. ఎగ్జామ్ హాల్ కి వెళ్ళేటప్పుడు కూడా కార్ లో నేను డ్రైవింగ్ చేస్తుంటే రియా చదివి వినిపించేది. జస్ట్ క్లియర్ చేయడమే పాస్ అయితే చాలు నాకు.

ముందు నుంచి చదువు వద్దు అని ఇంట్లో చెప్పినా వినలేదు. ఇంటర్ అయ్యాక వరల్డ్ మొత్తం తిరగాలని చెప్పి శ్రీలంక, దుబాయ్, ఆస్ట్రేలియా.. ఇలా చాలా దేశాలు తిరిగా. మా అమ్మ నా కొడుకు ఇంటర్ అని చెప్పుకోవాలా అని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తే వచ్చి డిగ్రీ చేశా. ముందు డిగ్రీ సర్టిఫికెట్ కొందాం అనుకున్నా కానీ మా నాన్న నువ్వు చేయకపోయినా పర్లేదు కానీ కొనొద్దు అన్నారు. మా అమ్మ మాత్రం కొన్న పర్లేదు నా కొడుక్కు డిగ్రీ ఉండాలి అంది. దాంతో నాకు కంఫర్ట్ ఉన్న కాలేజీ చూసి చేరాను. రానా, రామ్ చరణ్, నిహారిక, విశ్వక్ సేన్.. ఇలా చాలా మంది అక్కడే చదివారు అని తెలిపాడు.

Also Read : Devi Sri Prasad : దేవిశ్రీ ప్రసాద్ హీరోగా 8 ఏళ్ళ క్రితమే సినిమా అనుకున్నారు.. ఆ సినిమా, డైరెక్టర్ గురించి తెలుసా?

దీంతో ఇదంతా నిజమేనా లేక డ్రాగన్ సినిమా కథ చెప్తున్నావా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.