Janhvi Kapoor : జాన్వీ కపూర్ ఫోన్ వాల్ పేపర్ ఏంటో తెలుసా?

తాజాగా జాన్వీ కపూర్ ఫోన్ వాల్ పేపర్ ఏంటో తెలిసిపోయింది.

Janhvi Kapoor : జాన్వీ కపూర్ ఫోన్ వాల్ పేపర్ ఏంటో తెలుసా?

Do You Know Bollywood Actress Janhvi Kapoor Phone Screen Wall Paper

Updated On : March 12, 2024 / 8:30 AM IST

Janhvi Kapoor : శ్రీదేవి కూతురు, బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ త్వరలోనే దేవర సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. ఆ తర్వాత రామ్ చరణ్ 16వ సినిమా కుడా ఓకే చేసుకుంది. ఇక బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తుంది. సోషల్ మీడియాలో అయితే రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తుంది. జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ కోసం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా జాన్వీ కపూర్ ఫోన్ వాల్ పేపర్ ఏంటో తెలిసిపోయింది. ముంబై వీధుల్లో బాలీవుడ్ స్టార్స్ కనిపిస్తే కెమెరాలు వెంబడిస్తాయి అని తెలిసిందే. నిన్న రాత్రి జాన్వీ కనిపించగా కెమెరాలు జాన్వీని ఫోటోలు, వీడియోలు తీశాయి. అయితే జాన్వీ చేతిలో తన ఫోన్ పట్టుకొని వెళ్లి కార్ లో కూర్చుంది. ఆ సమయంలో తన ఫోన్ స్క్రీన్ పై ఉన్న వాల్ పేపర్ కనిపించింది. దీంతో ఆ ఫోటో కాస్తా వైరల్ గా మారింది.

Also Read : Jabardasth Avinash : ప్లీజ్ సినిమా ఛాన్సులివ్వండి.. టీవీ మొత్తం వదిలేస్తాను.. స్టేజిపై అడుక్కున్న జబర్దస్త్ అవినాష్..

ఇంతకీ జాన్వీ కపూర్ ఫోన్ వాల్ పేపర్ ఏంటంటే.. జాన్వీ చిన్నప్పుడు తన తల్లి శ్రీదేవితో కలిసి దిగిన ఫోటోని తన ఫోన్ వాల్ పేపర్ గా పెట్టుకుంది. దీంతో ఆ ఫోటో గూగుల్ లో వెతికేసి మరీ వైరల్ చేస్తున్నారు అభిమానులు. రోజూ శ్రీదేవిని చూడకుండా తన డే మొదలవ్వదని, తల్లి అంటే తనకు అంత ఇష్టమని, చిన్నప్పుడు తల్లితో ఉన్న జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకోడానికే జాన్వీ ఆ ఫోటో వాల్ పేపర్ గా పెట్టుకుందని అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి జాన్వీ వాల్ పేపర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జాన్వీ ఫోన్ లో వాల్ పేపర్ గా పెట్టుకున్న ఫోటో ఇదే..

Do You Know Bollywood Actress Janhvi Kapoor Phone Screen Wall Paper