Jabardasth Avinash : ప్లీజ్ సినిమా ఛాన్సులివ్వండి.. టీవీ మొత్తం వదిలేస్తాను.. స్టేజిపై వేడుకున్న జబర్దస్త్ అవినాష్..

టీవీలో వచ్చినంత పేరు సినిమాల్లో రావట్లేదు ఈ విషయంలో జబర్దస్త్ అవినాష్ బాధపడుతూ తాజాగా ఓ ఈవెంట్ లో సంచలన వ్యాఖ్యలు చేసాడు.

Jabardasth Avinash : ప్లీజ్ సినిమా ఛాన్సులివ్వండి.. టీవీ మొత్తం వదిలేస్తాను.. స్టేజిపై వేడుకున్న జబర్దస్త్ అవినాష్..

Jabardasth Avinash Requesting for Movie Chances on stage

Updated On : March 12, 2024 / 10:09 AM IST

Jabardasth Avinash : నటుడు అవినాష్ జబర్దస్త్ లో ఆర్టిస్ట్ గా మొదలుపెట్టి టీం లీడర్ గా ఎదిగి ముక్కు అవినాష్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. టీవీ షోలలో తనదైన కామెడీ పంచులతో అందర్నీ మెప్పిస్తాడు. జబర్దస్త్ తో వచ్చిన గుర్తింపుతో బిగ్‌బాస్ తో పాటలు అనేక టీవీ షోలలో పాల్గొంటున్నాడు. సినిమాల్లో కూడా కమెడియన్ గా నటిస్తున్నాడు. అయితే టీవీలో వచ్చినంత పేరు సినిమాల్లో రావట్లేదు అవినాష్ కి. సినిమా ఛాన్సులు కూడా రెగ్యులర్ గా రావట్లేదు. ఈ విషయంలో జబర్దస్త్ అవినాష్ బాధపడుతూ తాజాగా ఓ ఈవెంట్ లో సంచలన వ్యాఖ్యలు చేసాడు.

పార్వతీశం హీరోగా వస్తున్న మార్కెట్ మహాలక్ష్మి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాద్ లో జరగగా ఈ ఈవెంట్ కి చిత్రయూనిట్ అంతా విచ్చేసారు. ఈ సినిమాలో అవినాష్ కూడా ఓ పాత్ర చేయడంతో ఈవెంట్ కి వచ్చారు. ట్రైలర్ లాంచ్ అనంతరం మీడియాతో ముచ్చటించగా ఓ మీడియా ప్రతినిధి మీకు టీవీలో మంచి పేరు వచ్చింది, మీరు మంచి కమెడియన్ కానీ సినిమాల్లో అనుకున్నంత గుర్తింపు రావట్లేదు ఎందుకు అని అడిగారు.

Also Read : Pavala Syamala : అందరి హీరోలతో నటించా.. కానీ చివరికి నా జీవితం.. పావలా శ్యామల ఆవేదన..

దీనికి జబర్దస్త్ అవినాష్ మాట్లాడుతూ.. అదే నాకు అర్ధం కావట్లేదు. నేను నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. అయితే టీవీలో చేస్తున్నాను కాబట్టి డేట్స్ ఇస్తాడో, ఇవ్వడో అని ఛాన్సులు ఇవ్వట్లేదు. నేను సినిమా ఛాన్సుల కోసం బాగా ట్రై చేస్తున్నాను. సినిమాల కోసమే టీవీలో అన్ని ప్రోగ్రామ్స్ వదిలేసాను. ప్రస్తుతం ఒకటే ప్రోగ్రాం చేస్తున్నాను. ప్లీజ్ నాకు సినిమా ఛాన్సులివ్వండి. నేను ఏ పాత్ర అయినా చేస్తాను. కావాలంటే టీవీ మొత్తానికే వదిలేస్తాను అంటూ స్టేజిపైనే దర్శక నిర్మాతలను రిక్వెస్ట్ చేసుకున్నాడు. అలాగే తాను మెయిన్ లీడ్ లో కూడా ఓ సినిమా రాబోతుందని తెలిపాడు. ఇలా స్టేజిపైనే ఛాన్సులు అడగడంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి అవినాష్ కి ఇప్పుడైనా మంచి ఛాన్సులు వస్తాయేమో చూడాలి.