Pavala Syamala : అందరి హీరోలతో నటించా.. కానీ చివరికి నా జీవితం.. పావలా శ్యామల ఆవేదన..

అందరి హీరోలతో నటించాను. కానీ చివరికి నా జీవితం ఇలా అవుతుందని అనుకోలేదు అంటూ పావలా శ్యామల ఆవేదన.

Pavala Syamala : అందరి హీరోలతో నటించా.. కానీ చివరికి నా జీవితం.. పావలా శ్యామల ఆవేదన..

Telugu Actress Pavala Syamala feeling sad video gone viral

Updated On : March 11, 2024 / 9:16 PM IST

Pavala Syamala : సినిమా రంగంలో ఒకప్పుడు చేతినిండా సినిమాలతో బిజీ లైఫ్ చూసిన ఆర్టిస్టులు.. ఆ తరువాత అవకాశాలు లేక దీనస్థితికి చేరుకొని తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి పరిస్థితినే తెలుగు నటి ‘పావలా శ్యామల’ కూడా ఎదుర్కొంటున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ నుంచి ఇప్పటి స్టార్స్ ఎన్టీఆర్, గోపిచంద్, నాని సినిమాల్లో కూడా నటించిన పావలా శ్యామల.. ప్రస్తుతం వృద్ధాశ్రమంలో దీనస్థితిలో ఉన్నారు.

ఒకప్పుడు నటిగా బిజీ లైఫ్ ని చూసిన పావలా శ్యామల.. ప్రస్తుతం వయసు సహకరించకపోవడంతో సినిమాల్లో కనిపించడం లేదు. తనతో పాటు తన కూతురి ఆరోగ్యానికి కూడా చికిత్స చేయించుకుంటూ వస్తూ.. తినడానికి డబ్బులు లేని పరిస్థితికి చేరుకున్నారు. ఆమె పరిస్థితి తెలుసుకున్న పలువురు సినీ తారలు ఆమెకు ఎంతోకొంత సహాయం చేస్తూ వస్తూనే ఉన్నారు.

Also Read : Satyabhama : వరంగల్‌లో ‘సత్యభామ’ సీరియల్ నటీనటుల సందడి.. ప్రేక్షకులతో కలిసి ఆటపాటలు..

కాగా ప్రస్తుతం ఆమె నడవలేని స్థితిలోకి వచ్చేసారు. తాజాగా ఈమె ఓ ప్రముఖ టీవీ ఛానల్ లో ప్రసారమయ్యే ఒక ప్రత్యేక షోకి వచ్చారు. ఆ షోలో పావలా శ్యామల మాట్లాడుతూ.. “అందరి హీరోలతో నటించాను. అన్ని హిట్టు సినిమాల్లో ఉన్నాను. కానీ చివరికి నా బ్రతుకు ఇలా అవుతుందని అనుకోలేదు. ఇంతటి దుస్థితి వస్తుందని అసలు ఊహించలేదు. నా కష్టాలను చెప్పుకొని మిమ్మల్ని బాధపెట్టాలని మళ్ళీ మీ ముందుకు రాలేదు. నేను బ్రతికుండి మళ్ళీ మిమ్మల్ని చూస్తానో లేదో అనే భయంతో, ఒకసారి మీకు కనిపించి మీ అభిమానం పొందాలని ఇప్పుడు వచ్చాను” అంటూ వ్యాఖ్యానించిన మాటలు అందర్నీ కంటతడి పెట్టించాయి.

 

View this post on Instagram

 

A post shared by ᴮⁱᵍᵍᵇᵒˢˢ_ʰᵉᵃʳᵗ (@biggboss_heart)

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కాగా ‘మనం సైతం’ ఫౌండేషన్ ద్వారా సేవలు అందిస్తూ వస్తున్న కాదంబరి కిరణ్.. ఇటీవల శ్యామలను కలుసుకొని ఆమెకు రూ.25,000 నగదు సాయాన్ని చెక్ రూపంలో అందించిన విషయం తెలిసిందే.